మన ధ్యాస, నెల్లూరు,డిసెంబర్ 31:నూతన సంవత్సరం 2026… ప్రతి ఒక్కరి జీవితంలో సరికొత్త వెలుగులు నింపాలని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఆకాంక్షించారు. గురువారం ఆంగ్ల సంవత్సరం ప్రారంభం సందర్భంగా జిల్లా వాసులకు ఆయన 2026 ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. గతేడాది చేదు జ్ఞాపకాలు తొలగిపోయి ఈ నూతన సంవత్సరం కొత్త విజయాలను అందించాలన్నారు. భగవంతుడి నిండు ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని, గత విషయాల గురించి చింతించకుండా.. నూతన అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆయన చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, యువ నాయకులు నారా లోకేష్ సారథ్యంలో కూటమి ప్రభుత్వం ఈ ఏడాది ప్రజలకు మరింత మంచిని చేకూరుస్తుందన్నారు. ప్రజల బంగారు భవిష్యత్తును కాంక్షిస్తూ కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని వివరించారు. కొత్త ఆకాంక్షలతో ప్రజా జీవితం మరింత ఆకర్షణీయంగా ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు.
