మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ )
మహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో అన్నాసాగర్ సర్పంచ్ స్రవంతి సాయిగౌడ్‌ లకు హసన్‌పల్లి సర్పంచ్ హరిన్ కుమార్,గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నిఖిల్‌లు కలిసి శాలువా కప్పి పూలమాలతో సత్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధికి పరస్పర సమన్వయంతో పనిచేయాలని, ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు సర్పంచులు కలిసి కృషి చేయాలని గ్రామస్తులకు సూచించారు. ప్రజల నమ్మకానికి అనుగుణంగా పనిచేయడమే తమ లక్ష్యమని తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు మంగలి రాములు, దుర్గయ్య, వెంకట్ రాములు, చాకలి మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *