వింజమూరు, మన ధ్యాస,డిసెంబర్ 21,(నాగరాజు కె).

ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నేడు అనగా డిసెంబర్ 21 ఆదివారం జరుగు పల్స్ పోలియో కార్యక్రమాన్ని నూరు శాతం విజయవంతం చేయాలని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పేర్కొన్నారు. శనివారం ఆయన ఒక ప్రకటనలో మాట్లాడుతూ ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరూ పోలియో చుక్కలు వేయించుకోవాలన్నారు. నిండు జీవితానికి రెండు చుక్కలు వేయించుకొని ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలన్నారు. మూడు రోజులపాటు ఈ కార్యక్రమం జరుగుతుందని రాష్ట్రవ్యాప్తంగా 54 లక్షల పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. మూడు రోజులపాటు జరుగు పల్స్ పోలియో 21వ తేదీ బూత్ ల వారీగా, 22 ,23 తేదీల్లో ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి తిరిగి పోలియో చుక్కలు వేస్తారన్నారు. కనుక ఈ చక్కని అవకాశాన్ని పిల్లల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *