కలిగిరి, మన న్యూస్, డిసెంబర్ 17,(కె నాగరాజు).
రాష్ట్ర శాసన మండల సభ్యులు బీద రవిచంద్ర తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షులుగా ఎంపిక కావడం శుభ పరిణామం అని ఉదయగిరి నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షులు స్వర్ణ కొండయ్య తెలియజేసారు. ఈ సందర్భంగా ఎస్సీ సెల్ అధ్యక్షులు స్వర్ణ కొండయ్య మాట్లాడుతూ రాజకీయాల్లో పరిణతితో కూడిన నైతిక విలువలు కలిగిన నేతగా బీద రవిచంద్రను అభివర్ణించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి బీద రవిచంద్ర చేసిన కృషి అజరామరం అని అన్నారు. బీద రవిచంద్ర తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, రాయలసీమ జోన్ ఇన్చార్జిగా, గతంలోనూ టిడిపి జిల్లా అధ్యక్షునిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షునిగా విభిన్న హోదాలలో పదవులను అలంకరించి తెలుగుదేశం పార్టీకి మరింతగా వన్నెతెచ్చిన మహానుతలు అని అభిప్రాయపడ్డారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన బలమైన నేతగా ఉన్న బీద రవిచంద్ర యాదవును ఆయన పార్టీకి అందించిన విశేషమైన సేవలను గుర్తిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీద రవిచంద్రన్ నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అధ్యక్షులుగా నియమించడం పట్ల టీడీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపినట్లుందని స్వర్ణ కొండయ్య అన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యువనేత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లకు ఉదయగిరి నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షులు స్వర్ణ కొండయ్య కృతజ్ఞతలు తెలియజేశారు