

మన న్యూస్: తిరుపతిలోని అన్నమాచార్య కళాక్షేత్రంలో టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రవచనాలు నగర వాసులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి రమేష్ బాబు సోమవారం సాయంత్రం వాల్మీకి రామాయణంలోని కిష్కిందకాండ అధ్యయనాన్ని పద్యాలతో సహా వివరించారు. అపహరణకు గురైన సీతాదేవిని వెతుక్కుంటూ రామచంద్రమూర్తి కిష్కింద చేరుకోవడం అక్కడ ఆంజనేయస్వామితోపాటు సుగ్రీవుడు, జాంబవంతుడు వంటి వీరులను కలుసుకొని సహాయం కోరడం వంటి ఘట్టాలను కళ్ళకు కట్టినట్టుగా వివరించారు. లోకాభిరాముని జీవితం విశ్వానికి ఆదర్శమని వివరించారు. ఈ సందర్భంగా స్థానిక రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రవచన కర్త గరికపాటి రమేష్ బాబును దుస్థాలతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ సభ్యులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి పద్మనాభం పురోహితుడు సురేష్ స్వామి టీచర్ తిరుమలయ్య వెంకట్రామయ్య కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి అన్నమయ్య కళామందిరం సిబ్బంది కోకిల తదితరులు పాల్గొన్నారు.