

మన న్యూస్ పాచిపెంట,డిసెంబర్ 9: పాచిపెంట మండలం లో మోసూరు గ్రామంలో సోమవారం జరిగిన రెవెన్యూ సదస్సుకు అనూహ్యస్పందన లభించింది. తహసిల్దారు డి రవి విలేకరులతో మాట్లాడుతూ సుమారు వందమంది పైగా రైతులు తాము సాగు చేస్తున్న డి పట్టా భూములను చిరాయితీ భూములుగా మార్చి పాసుపుస్తకాలు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. అలాగే గ్రామ శివారు లో వున్న ఇందిరమ్మ చెరువు ఆక్రమణలకు గురి అయిందని వెంటనే సర్వే చేసి ఆక్రమణలు తొలగించి రైతులకు తగు న్యాయం చేయాలని కోరి నట్టు తెలియజేశారు. రెవెన్యూ సదస్సులో పదిమందికి పైగా కొత్త రేషన్ కార్డులు కోసం దరఖాస్తులు చేసుకున్నారని ఆయన తెలిపారు. సమస్యలన్నీ ఒక్కొక్కటిగా పరిష్కారం చేస్తామని తాసిల్దార్ రవి హామీ ఇచ్చారు.