మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలం మాగీ గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా మెంగారం నాగలక్ష్మి శ్రీనివాస్ ని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మండల నాయకులతో కలిసి ఎంపిక చేశారు.నిజాంసాగర్ మండలంలోని మాగీ గ్రామ ప్రజలు మెంగారం నాగలక్ష్మి శ్రీనివాస్ భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పార్టీ అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలని సూచించారు.మెంగారం నాగలక్ష్మి శ్రీనివాస్ గెలిపిస్తే మాగీ గ్రామం అభివృద్ధి చెందుతుందని.. గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని ఎమ్మెల్యే తెలిపారు.అధికార పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటే గ్రామాల్లో అభివృద్ధి పరుగులు పెడుతుందని అన్నారు.
ప్రజా ప్రభుత్వం రెండేళ్లలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని,పేదలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నదని,ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదిస్తే భవిష్యత్ లో మరిన్ని అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుందని అన్నారు.
రాజకీయ,సామాజిక సమీకరణాల్లో భాగంగా అవకాశం దక్కని ఆశావాహులు ఎవరు కూడా నిరాశపడవద్దని అన్నారు.
రాబోయే రోజుల్లో వారికి మంచి అవకాశాలు లభిస్తాయని భరోసా ఇచ్చారు.
పార్టీ గెలుపు కోసం కష్టపడిన వారికి తప్పక గుర్తింపు ఉంటుందని, సముచిత స్థానం కల్పిస్తానని చెప్పారు.ఈ కార్యక్రమంలో పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్,తదితరులు ఉన్నారు.









