పేరెంట్స్ టీచర్స్ కమిటీ మీటింగులన్ని కూటమి ప్రభుత్వ పొలిటికల్ స్టంట్స్ గా మారాయని విరుచుకపడ్డ .ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

మన న్యూస్, డిసెంబర్ 8) నెల్లూరు రాంజీ నగర్ లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ కార్యాలయంలో నగర నియోజకవర్గ ఇన్ చార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆదివారం మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ రాయచోటిలో ఉపాధ్యాయుడి పై విద్యార్థులు దాడి చేసి చంపడం దురదృష్టకరమని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు.కూటమి ప్రభుత్వం నిర్వహించిన పేరెంట్స్ టీచర్స్ కమిటీ మీటింగ్ లు రాజకీయ సమావేశాలకు వేదికగా మారాయి అన్నారు.ప్రభుత్వం విడుదల చేసిన గైడ్ లైన్స్ ప్రకారం ఎక్కడా పేరెంట్స్ టీచర్స్ కమిటీ మీటింగ్ లు జరగలేదు అన్నారు.సింగిల్ టీచర్ ఉన్న పాఠశాలల్లో పేరెంట్స్ టీచర్స్ కమిటీ మీటింగ్ లు ఏ విధంగా నిర్వహించాలో ప్రభుత్వమే చెప్పాలన్నారు.గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం లో విద్యా రంగానికి వైయస్ జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేశారని గుర్తు చేశారు అన్నారు. నాడు నేడు, అమ్మ ఒడి, విద్యా దీవెన వసతి దీవెన, మిడ్ డే మీల్స్, టోఫెల్ శిక్షణ, ఐ ఎఫ్ పి ,పేనల్ బోర్డ్స్, బైజుస్ టాబ్స్, సీబీఎస్ఈ సిలబస్ మొదలకు పథకాలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థలో మెరుగైన సంస్కరణలు తీసుకువచ్చారని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నింటినీ పక్కన పెట్టిందన్నారు.కనీసం నాడు నేడు పనులలో అదనపు తరగతి భవనాల కోసం వచ్చిన తలుపులు కిటికీలు కూడా పాఠశాలలకు బిగించు కోలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు.కూటమి ప్రభుత్వ పాలనను ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు.ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల కాక కళాశాలలో విద్యార్థులు సర్టిఫికెట్లు తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారని అన్నారు.అదే జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న 2 వేల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేశారని గుర్తు చేశారు.వైసీపీ ప్రభుత్వం వస్తూనే ఉద్యోగులకు చెప్పిన విధంగా జగన్మోహన్ రెడ్డి ఐఆర్ ప్రకటించారని తెలిపారు. ఈరోజు కూటమి ప్రభుత్వ పాలనలో ఫీజు రీయింబర్స్మెంట్ అందక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. గతంలో అమ్మఒడి ద్వారా ఇస్తున్న 15 వేల రూపాయలను కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇంట్లో చదువుతున్న ప్రతి బిడ్డకు తల్లికి వందనం పేరుతో 15 వేల రూపాయలు ఇస్తామని చెప్పి.. ప్రజలను నిలువునా ముంచారని అన్నారు.ఈరోజు ఉద్యోగస్తులు పరిస్థితి కూడా దారుణంగా ఉందని కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐ ఆర్, డి ఏ లు క్లియర్ చేస్తామని..చెప్పి ఈరోజు ఉద్యోగస్తులకు మొండి చేయ్య్ చూపారని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం జిపియస్ పెన్షన్ స్కీమ్ తీసుకుని వస్తే.. కూటమి ప్రభుత్వం అంతకంటే మెరుగ్గా పెన్షన్ ఇస్తామని చెప్పి.. ఈరోజు దానిపై నోరు మెదపడం లేదన్నారు.అలాగే వైసిపి ప్రభుత్వం లో కాంట్రాక్టు ఉద్యోగులు రెగ్యులరైజ్ చేసేందుకు 90% కార్యచరణ పూర్తి చేస్తే..కూటమి ప్రభుత్వం దాని గురించి పట్టించుకోవడం లేదన్నారు.ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి.. విద్యా వ్యవస్థలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు అమలు చేయాలని.. అలాగే ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
లేదంటే ప్రజాక్షేత్రంలో కూటమి ప్రభుత్వానికి పరాభం తప్పదని హెచ్చరించారు.

  • Related Posts

    పొర్లు కట్ట ప్రాంత వాసుల చిరకాల కోరిక నెరవేర్చిన రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ

    మన ధ్యాస , నెల్లూరు ,డిసెంబర్ 7: నెల్లూరు నగరం ,48వ డివిజన్ ప్రజల చిరకాల కోరికను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ నెరవేర్చారు.డివిజన్లో పర్యటించినప్పుడు స్థానిక ప్రజలు 40 ఏళ్లుగా ప్రహరీ గోడ ,…

    క్రైస్తవ పండుగలో ఆరాధన ఉండాలి……పులగర శోభనబాబు

    మన ధ్యాస ,తోటపల్లి గూడూరు , డిసెంబర్ 7:నెల్లూరు జిల్లా ,తోటపల్లి గూడూరు మండలం, కోడూరు బీచ్ దగ్గర లోని ముత్యాలతోపు గ్రామంలోని యేసు ప్రార్థన మందిరం నందు ఆదివారం జరిగిన ఆరాధన కూడిక లో ముఖ్య ప్రసంగీకులుగా పాస్టర్స్ పవర్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ప్రజల సమస్యలకే ప్రాధాన్యం అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి తక్షణ సహాయం చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్.

    ప్రజల సమస్యలకే ప్రాధాన్యం అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి తక్షణ సహాయం చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్.

    పొర్లు కట్ట ప్రాంత వాసుల చిరకాల కోరిక నెరవేర్చిన రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ

    పొర్లు కట్ట ప్రాంత వాసుల చిరకాల కోరిక నెరవేర్చిన రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ

    క్రైస్తవ పండుగలో ఆరాధన ఉండాలి……పులగర శోభనబాబు

    క్రైస్తవ పండుగలో ఆరాధన ఉండాలి……పులగర శోభనబాబు

    నెల్లూరు రూరల్ లో పార్క్ నందు ఏర్పాటు చేస్తున్న సోలార్ లైట్స్ పనులు పర్యవేక్షించిన టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

    నెల్లూరు రూరల్ లో పార్క్ నందు ఏర్పాటు చేస్తున్న సోలార్ లైట్స్ పనులు పర్యవేక్షించిన టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

    అప్పన్న పరిస్థితి బాగోలేదంటేనే ఆరోజు సహాయం చేశా…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    అప్పన్న పరిస్థితి బాగోలేదంటేనే ఆరోజు సహాయం చేశా…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    ప్రజాసేవలో ఇద్దరూ….ఇద్దరే , వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి…. పొంగూరు నారాయణ

    ప్రజాసేవలో ఇద్దరూ….ఇద్దరే , వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి…. పొంగూరు నారాయణ