బాధిత కుటుంబానికి 10వేల రూపాయలు కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ తరపున చేయూత..!
కలిగిరి నవంబర్ 24 మన ధ్యాస న్యూస్://
కలిగిరి మండలం పడమర గుడ్లదొన గ్రామానికి చెందిన షేక్ యాస్మిన్ గత కొద్ది రోజుల క్రితం అకస్మాత్తుగా అనారోగ్య సమస్యతో దురదృష్టవశాత్తు కన్నుమూశారు. ఆమె మరణంతో కుటుంబం కష్టాల్లో మునిగిపోగా, ఆమెకు ఇద్దరు చిన్న ఆడపిల్లలు మాత్రమే సంతానంగా మిగిలారు.ఈ పరిస్థితిని స్థానిక నాయకులు గుర్తించి ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కి వివరించగా, విషయం తెలిసిన వెంటనే ఆయన మానవతా దృక్పథంతో స్పందించారు. ఆ కుటుంబానికి అండగా నిలుస్తూ, కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ తరఫున తక్షణ ఆర్థిక సహాయంగా రూ.10వేల రూపాయలను అందించారు. తల్లిని కోల్పోయిన ఆ చిన్నారుల భవిష్యతుకు అండగా ఉంటానని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తెలిపారు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ స్పందన పట్ల స్థానిక ప్రజలు, నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.