మానవతా హస్తం చాచిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ బాధిత కుటుంబానికి ఆర్థిక భరోసా..
కలిగిరి నవంబర్ 24 మన ధ్యాస న్యూస్:///
కలిగిరి మండలంలోని పోలంపాడు గ్రామానికి చెందిన వంగల్లు లక్ష్మి, భర్త మృతితో తీవ్రమైన ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ జీవనాధారాన్ని కోల్పోయిన పరిస్థితిని స్థానిక నాయకులు ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ కి వివరించారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే, మానవతాభావంతో ఆమె కుటుంబాన్ని ఆదుకోవాలనే సంకల్పంతో, కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ 10వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని వ్యక్తిగతంగా అందించారు.అవసర సమయంలో ముందుకు వచ్చి సహాయం చేయడం ద్వారా ప్రజల సమస్యలను అత్యంత సానుభూతితో అర్థం చేసుకుని స్పందించే నాయకత్వ లక్షణాన్ని కాకర్ల సురేష్ మరోసారి చాటిచెప్పారు. ఈ సహాయం వంగల్లు లక్ష్మి కి తాత్కాలిక ఆర్థిక భరోసాను కలిగిస్తూ, ఆమె కుటుంబానికి కొంత ఉపశమనం కల్పించింది.ఈ కార్యక్రమంలో మండల నాయకులు, స్థానిక నాయకులు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.