వింజమూరు నవంబర్ 21 మన ధ్యాస న్యూస్://

గ్రామపంచాయతీల సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో ముఖ్య అంశమైన క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్ కి సంబంధించి, వింజమూరు మండలంలోని 12 గ్రామపంచాయతీల లో పనిచేయుచున్న గ్రీన్ అంబాసిడర్లు గ్రీన్ కార్డులకు ఈరోజు వింజమూరు గ్రామపంచాయతీలోని చెత్త నుండి సంపద తయారీ కేంద్రం వద్ద ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించబడినది. గ్రామాలలో ప్రతి ఇంటి నుంచి తడి మరియు పొడి చెత్తలను వేరుగా సేకరించటం, గ్రామాలను చూడ చక్కని విధంగా రూపొందించడం సేకరించినటువంటి చెత్తను సరిగా నిర్వహించడం తడి చెత్తను సేంద్రియ ఎరువుగా మార్చడం మరియు పొడి చెత్తను రీసైక్లింగ్ కొరకు అమ్మడం మొదలగు అంశాలపై వారికి క్షేత్ర స్థాయి శిక్షణ ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, శ్రీనివాసులు డిప్యూటీ ఎంపీడీవో రామారావు పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *