అభివృద్ధికి పట్టం కట్టిన కూటమి ప్రభుత్వం – 1 కోటి 75 లక్షల నాబార్డ్ నిధులతో కొత్తూరు రహదారి ప్రారంభం..!
కలిగిరి నవంబర్ 19 మన ధ్యాస ప్రతినిధి://

కలిగిరి మండలం వెలగపాడు పంచాయతీలో సంగం–కలిగిరి రహదారి నుండి కొత్తూరు గ్రామానికి నాబార్డ్ RIDF నిధుల సహకారంతో రూ.1 కోటి 75 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన రహదారి ప్రారంభోత్సవానికి ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పాల్గొని, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర అభివృద్ధిలో రహదారుల ప్రాధాన్యతను గుర్తించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించగా, పాడైపోయిన రహదారుల మరమ్మత్తులు చేపట్టడమే కాకుండా అవసరమైన చోట కొత్త రహదారుల నిర్మాణానికి కూడా ప్రాధాన్యత ఇచ్చారు. ప్రజలు ప్రయాణంలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా ఉండేందుకు ప్రభుత్వం సమగ్ర కార్యాచరణను అమలు చేస్తూ అభివృద్ధి పట్ల తమ కట్టుబాటును మరోసారి చాటుకుంది.ఈ కార్యక్రమంలో మండల నాయకులు స్థానిక నాయకులు కార్యకర్తలు కూటమి కుటుంబ సభ్యులు అధికారులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
