మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్): మూడు ఇసుక ట్రాక్టర్లను అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శివకుమార్ తెలిపారు.నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ గ్రామానికి చెందిన ఒక ట్రాక్టర్‌ను నిన్న అర్ధరాత్రి అక్రమంగా ఇసుక రవాణా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.మాగి గ్రామ శివారులోని మంజీరా నుంచి ప్రభుత్వం అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను ఉదయం సమయంలో గుర్తించి స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్ ఐ తెలిపారు.ఈ సందర్భంగా ఎస్‌ఐ శివకుమార్ మాట్లాడుతూ—ప్రభుత్వ అనుమతి లేకుండా ఏ గ్రామంలోనైనా ఇసుక రవాణా అక్రమంగా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు.









