సీతారామపురం నవంబర్ 12 :మన ధ్యాస న్యూస్://
సీతారామపురం మండలం లోని మారంరెడ్డిపల్లిలో సీతారామపురం మాజీ జడ్పిటిసి సభ్యురాలు కలివెల జ్యోతి మేనకోడలు కనుమూరి ప్రియాంక – మధు వివాహ రిసెప్షన్ బుధవారం ఘనంగా వైభవోపేతముగా ఉత్సాహభరిత వాతావరణములో జరిగింది. ఈ కార్యక్రమానికి ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాకర్ల సురేష్ హాజరై నూతన వధూవరులు ప్రియాంక – మధు లను ప్రేమాభిమానాలతో ఆశీర్వదించి, వారిని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా కాకర్ల సురేష్ మాట్లాడుతూ “వివాహం అనేది మనిషి జీవితంలో అత్యంత పవిత్రమైన, ఆనందకరమైన క్షణమాని, ఈ నూతన దంపతులు పరస్పర ప్రేమాభిమానాలతో, పరస్పర గౌరవంతో, ఆనందం మరియు సౌభాగ్యంతో నిండిన జీవితాన్ని సాగించాలని మనసారా కోరుకుంటున్నాను” అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కూటమి నాయకులు, కార్యకర్తలు, బంధుమిత్రులు, తదితరులు పాల్గొన్నారు.









