పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా- ఎమ్మెల్యే కాకర్ల ..!
వింజమూరు, నవంబర్ 12 మనధ్యాసన్యూస్:///

తెలుగుదేశం పార్టీ అధినేత,ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సూచనలతో ఉదయగిరి నియోజకవర్గంలో టిడిపి బూత్ కన్వీనర్లు, కో-కన్వీనర్ల ప్రమాణ స్వీకార మహోత్సవం బుధవారం వింజమూరు ప్రధాన టిడిపి కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమమునకు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అధ్యక్షత వహించగా, నియోజకవర్గంలోని 8 మండలాల ప్రధాన నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామ నాయకులు, మహిళా నాయకులు మరియు వేలాదిమంది కార్యకర్తలు భారీగా హాజరై ఈ వేడుకను విజయవంతం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అనేది కేవలం ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదనీ, ఇది లక్షలాది మంది కార్యకర్తల ఆశయాలు, ఆత్మీయతలు మిళితమైన పార్టీ అని, పార్టీ కోసం ఎన్నో కష్టాలు పడిన ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రతి నాయకుడికి తగిన గుర్తింపు, గౌరవం దక్కేలా కృషి చేస్తాను అని హామీ ఇచ్చారు.కార్యకర్తలే పార్టీకి అండదండని, వారే పార్టీకి నిజమైన సైనికులనీ, వారు ప్రజల్లో పార్టీ పతాకాన్ని ఎగురవేస్తున్నారనీ. పదవులు పొందిన నాయకులు ఆ పదవులను అలంకారప్రాయంగా కాకుండా ప్రజాసేవా సాధనంగా చూడాలని ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి” అని పిలుపునిచ్చారు.“నియోజకవర్గంలో ప్రతి గ్రామం వరకు తెలుగుదేశం పతాకం ఎగురవేయడం, ప్రజలకు పార్టీ తీరుతెన్నులు చేరవేయడం మనందరి బాధ్యత. మన సమష్టి కృషితో తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం అవుతుంది” అని కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.









