మన ధ్యాస ,నిజాంసాగర్,( జుక్కల్ ) పిట్లం లో పోలీసు సిబ్బంది విధుల్లో ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. పిట్లం పోలీస్ స్టేషన్ ను మంగళవారం ఆయన తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఎస్పీ సిబ్బందితో మాట్లాడి.వారి పనితీరును స్వయంగా పరిశీలించారు.అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజల అ వసరాలకు అనుగుణంగా పని చేయడం ప్రతి పోలీస్ సిబ్బంది బాధ్యత అని అన్నారు.ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో ఆలస్యం జరగకూడదని సూచించారు.సిబ్బంది ఏవైన సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే వాటిని పైఅధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు.ఈ కార్యక్రమంలో బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి,సీఐ తిరుప తయ్య,ఎస్ ఐ వెంకట్రావ్ పాల్గొన్నారు.










