బంగారుపాళ్యం నవంబర్ 11 మన ద్యాస
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలంలోని కేజీ సత్రం వద్ద చీకూరుపల్లి కొండపై గుహల్లో వెలసియున్న శ్రీ పార్వతి సమేత సిద్దేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధి కొరకు అమ్మఒడి ట్రస్ట్ ఫౌండర్ చెరుకూరి పద్మనాభ నాయుడు దంపతులు 5000రూ విరాళం ఇచ్చారు.వారికి గ్రామస్తులు ఆలయ మర్యాదలతో దర్శనం ఏర్పాట్లు గావించి తీర్థప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో సల్లగుండ్ల సుశీలమ్మ, అమ్మఒడి టీమ్ మురళి,వాసు,మదు ఆచారి, గణేష్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవిత్రమైన భారత దేశంలో మన దేవుళ్లు కొండ గుహల్లో కొండల పైన కొన్ని వందల సంవత్సరాలకు ముందు కొలువైవున్నారని అలాంటి దేవాలయము ఈ సిద్ధేశ్వరస్వామి అలయమని అన్నారు.హిందువుల అదృష్టం, ఇలాంటి గుళ్ళకు భక్తులు విచేసి, అభివృద్ధికి ప్రతి ఒక్కరూ వారిశక్తి కొద్ది సహాయం చేయాలని కోరారు.







