కనిగిరి నవంబర్ 8 మన ధ్యాస న్యూస్ ://
కనిగిరి నియోజకవర్గం పామూరు మండలం తూర్పు కోడిగుడ్లపాడు గ్రామపంచాయతీ పరిధిలోని పోతవరం గ్రామ వాస్తవ్యులు అద్దంకి నాగమల్లేశ్వరరావు, శ్రీమతి వైదేహి దంపతుల కుమారుడు చిరంజీవి నాగరాజు, నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం సోమల రేగడ గ్రామ వాస్తవ్యులు మన్నేపల్లి శ్రీనివాసులు శ్రీమతి లక్ష్మీదేవి దంపతుల కుమార్తె లావణ్య ల వివాహ వేడుకలు శనివారం తెల్లవారుజాము 3 గంటల 29 నిమిషాలకు పోతవరం గ్రామంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వివాహ వేడుకల్లో కనిగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్ పాల్గొని నాగరాజు దంపతులను అక్షింతలతో ఆశీర్వదించి వివాహ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నక్కల గండి రిజర్వాయర్ మాజీ చైర్మన్ అద్దంకి మాల్యాద్రి, అద్దంకి నాగయ్య, అద్దంకి మల్లికార్జునరావు, మాల్యాద్రి, ప్రకాష్ రావు, కొండలరావు, ఇండ్ల చెరువు వెంకటేష్, అద్దంకి వారి కుటుంబ సభ్యులు, మన్నేపల్లి వారి కుటుంబ సభ్యులు, ఇండ్ల చెరువు వారి కుటుంబ సభ్యులు పాల్గొని వధూవరులను అక్షింతలతో ఆశీర్వదించారు.








