కనిగిరి నవంబర్ 6 మన ధ్యాస న్యూస్
కనిగిరి నియోజకవర్గం పామూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన మాకినేని శ్రీనివాసరావును గురువారం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కనిగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్, పామూరు సింగిల్ విండో మాజీ అధ్యక్షులు బైరెడ్డి జయరామిరెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి దుశ్యాలవతో సన్మానించి, కనకదుర్గ అమ్మవారి పట్టు వస్త్రాన్ని బహుకరించారు. ఈ సందర్భంగా వారు సీఐతో పలు విషయాలపై సుధీర్గంగా చర్చించారు. పామూరు పట్టణంలో ప్రధాన సమస్య ట్రాఫిక్ ను నియంత్రించాలని, హైవేపై జరుగుతున్న ప్రమాదాలను అరికట్టేందుకు కృషి చేయాలని, సర్కిల్ ఇన్స్పెక్టర్ మాకినేని శ్రీనివాసరావును దారపనేని, బైరెడ్డి సూచించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ పట్టణంలో ఉన్న ట్రాఫిక్ సమస్యపై పూర్తి సమాచారాన్ని సేకరించి త్వరలో ట్రాఫిక్ సమస్యను నియంత్రిస్తానని హామీ ఇచ్చారు. సీఐ ని సన్మానించిన వారిలో మోపాడు తెలుగుదేశం పార్టీ నాయకులు యరశింగు రాయుడు పాల్గొన్నారు.








