

మన న్యూస్: పినపాక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో మూడేళ్లు నాలుగేళ్లు మాత్రమేనంటూ, మాజీ మంత్రి కేటీఆర్ పగటికలలు కంటూ మూర్ఖత్వపు భ్రమలో తేలాడుతున్నాడని… పినపాక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గొడిశాల రామనాధం అన్నారు. శుక్రవారం ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకులతో బయ్యారం క్రాస్ రోడ్ లోని పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశంలో మాట్లాడారు. పదవి ప్రభుత్వం పోయిందన్న తీవ్ర నిరాశలో కూరుకుపోయిన కేటీఆర్ కు, తమ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమం చూసి ఓర్వలేక పిచ్చిపట్టినట్టు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేసారు. మరో పాతికేళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని, అప్పటివరకు కేటీఆర్ భ్రమలోనే ఉంటాడని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం రెండు కల్లుగా ముందుకు సాగుతుందని అన్నారు. ఇప్పటికే ప్రతీ ఇంటికి ఉచిత కరెంటు, రైతులకు రెండు లక్షలు రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదిలోనే 60 వేల ఉద్యోగాల భర్తీ చేసి, కాంగ్రెస్ జనరంజక పాలన అందించిందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు లక్షల యాభై వేల మందికి అతి త్వరలోనే పక్కా ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తామని అన్నారు. డిసెంబర్ 09 సోనియా గాంధీ పుట్టినరోజున, రాష్ట్ర సచివాలయంలో నిజమైన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరణ జరుగుతుందని, ఆరోజు తెలంగాణ ప్రజలకు స్వర్ణయుగంలా దేశ చరిత్రలో మిగిలిపోతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు గంగిరెడ్డి వెంకట్ రెడ్డి, గీద సాయిబాబు, గంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కొండేరు సంపత్ కుమార్, బోడ లక్ష్మణ్ రావ్ లు పాల్గొన్నారు.