మన ధ్యాస ,నెల్లూరు, అక్టోబర్ 23:రాష్ట్రంలోని మొట్టమొదటిసారిగా నెల్లూరు మైపాడు గేట్ సెంటర్లో సర్వాంగ సుందరంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ సహకారంతో స్మార్ట్ స్ట్రీట్ బజార్ రూపుదిద్దుకుంది. ఈ క్రమంలో మంత్రి నారాయణ, ఆయన కుమార్తె షరణి స్మార్ట్ స్ట్రీట్ బజార్ ను ఆకస్మికంగా సందర్శించారు. మహిళా వ్యాపారులతో వారు ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. బాగున్నారా, వ్యాపారాలు ఎలా జరుగుతున్నాయి, ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అంటూ ఆరా తీశారు. ఈ సందర్భంగా ఓ షాపులో మంత్రి నారాయణ కుమార్తె షరణి ఓ చీరను కొనుగోలు చేశారు. మహిళా వ్యాపారస్తులు అందరితో ఆప్యాయంగా మాట్లాడుతూ…… వారు ముందుకు కదిలారు. తమ షాపుల వద్దకు వచ్చిన మంత్రికి, ఆయన కుమార్తెకు వ్యాపారస్తులు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నారాయణ విద్యాసంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ,మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్ళపాక అనురాధ, మాజీ జెడ్పిటిసి విజేత రెడ్డి, నగర అధ్యక్షుడు మామిడాల మధు, టిడిపి ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.










