మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్): మొహమ్మద్ నగర్ మండలంలోని బూర్గుల్ గ్రామంలో ఆదివాసి నాయకపోడ్ జిల్లా కమిటీ, కుల పెద్దల ఆధ్వర్యంలో ఆదివాసీ వీరుడు కొమరం భీమ్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈసందర్భంగా కొమరంభీమ్ చిత్రపటానికి మొట్టపెంటయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం జిల్లా కమిటీ అధ్యక్షుడు మొట్టపెంటయ్య మాట్లాడుతూ — కొమరం భీమ్ ఆశయాలు, స్ఫూర్తిని అనుసరించి ప్రతి ఒక్కరు జాతి అభివృద్ధి, ఐక్యత కోసం కృషి చేయాలి. ఆయన చూపిన మార్గంలో నడిస్తే సమాజ ప్రగతి సాధ్యమవుతుంది అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి టెంకటి సాయిబాబా,జిపిఓ ఆంజనేయులు,కుల పెద్దలు కాశీరాం,భూమయ్య,రాజు, సాయిలు,విఠల్, సాయిరాం, గ్రామ పెద్దలు భాస్కర్ రెడ్డి, జీవన్, రాములు, బలరాం, సంగమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.









