కలిగిరి అక్టోబర్ 1:(మన ధ్యాస న్యూస్ ):////
కలిగిరి మండలం, చిన్న అన్నలూరు పంచాయతీ పరిధిలోని తొగురువారిపాలెం గ్రామంలో మాజీ సర్పంచ్ చిట్టిబోయిన గోవిందయ్య – శ్రీమతి సుభాషిని గార్ల కుమార్తె చి||ల||సౌ. రాజ్యలక్ష్మి వివాహ వేడుకలలో భాగంగా గంధపు నలుగు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది.ఈ సందర్భంగా ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ , మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి ప్రత్యేక అతిథులుగా హాజరై వధువుకు అక్షింతలు వేసి ఆశీర్వదించారు. నూతన దంపతుల భవిష్యత్తు ఆనందమయం కావాలని కోరుతూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.అలాగే, ఈ కార్యక్రమానికి మాజీ పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ మెట్టుకూరి చిరంజీవి రెడ్డి , కలిగిరి మండల ఎంపీపీ మెట్టుకురి శిరీష , మండల కన్వీనర్ బిజ్జం కృష్ణారెడ్డి హాజరై వధువును ఆశీర్వదించారు. పలువురు ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, గ్రామ పెద్దలు, పార్టీ కార్యకర్తలు, బంధుమిత్రులు ఉత్సాహంగా పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.