కలిగిరి అక్టోబర్ 1:(మన ధ్యాస న్యూస్ ):///

రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతూ.. తమ జీవితాల్లో విజయాలు అందిపుచ్చుకోవాలని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ఆకాంక్షించారు. చెడుపై మంచి గెలిచిన పర్వదినం విజయదశమి అని, ప్రజలందరికీ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా దేవీ నవరాత్రులు అంగరంగ వైభవంగా జరిగాయని, ఆ దుర్గామాత ఆశీస్సులు ప్రజలందరిపై పుష్కలంగా ఉండి, భక్తుల కోరికలు నెరవేరాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న సీఎం నారా చంద్రబాబు నాయుడు పై, రాష్ట్ర ప్రభుత్వంపై ఆ పరంజ్యోతి కరుణాకటాక్షాలు మెండుగా ఉండాలని, విజయదశమి స్ఫూర్తితో రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలవాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. ముందుగా ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు, నాయకులకు, అధికారులకు, శ్రేయోభిలాషులకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *