మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మొహమ్మద్ నగర్ మండల పరిధిలోని బాన్సువాడ–ఎల్లారెడ్డి–నిజాంసాగర్ ప్రధాన రహదారిలో బొగ్గుగుడిసె చౌరస్తా వద్ద రోడ్డుపై ఓ కుక్క మృతి చెందింది.దాంతో అక్కడ గుండా వెళ్లే వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాహనాలు నెమ్మదిగా కదలడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తే పరిస్థితి ఏర్పడింది.ఈ విషయాన్ని గమనించిన ఎల్లారెడ్డి పోలీస్‌స్టేషన్ హెడ్‌కానిస్టేబుల్ ప్రతాప్‌రెడ్డి వెంటనే స్పందించి మానవత్వం చాటుకున్నారు.సహచర పోలీసులతో కలిసి కుక్క మృతదేహాన్ని రోడ్డుపై నుంచి తొలగించి పక్కప్రాంతానికి తరలించారు.దాంతో రహదారిపై వాహనాలు సాఫీగా రాకపోకలు సాగించగలిగాయి.
ప్రజలకు ఇబ్బందులు కాకుండా,తమ సేవా భావాన్ని చాటిన ఎల్లారెడ్డి పోలీసుల పట్ల స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో చాలా మంది నిర్లక్ష్యం చూపిస్తారు. కానీ పోలీసులు ముందడుగు వేసి మానవత్వం చాటుకోవడం ప్రశంసనీయం అని ప్రజలు అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో హెడ్‌కానిస్టేబుల్ ప్రతాప్‌రెడ్డి తో పాటు పోలీసులు స్వామి గౌడ్, మోహన్,ఆశ,రచన తదితరులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డి పోలీసులు ప్రజా సేవలో చూపుతున్న తపన, బాధ్యతాయుత వైఖరికి ప్రజలు మెచ్చుకున్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *