(మన ద్యాస న్యూస్): నెల్లూరు ప్రతినిధి, సెప్టెంబర్ 22:///
నా కుమారుడు ఇంటి నుంచి గెంటి వేశాడు న్యాయం చేయండి..తక్షణం న్యాయం చేస్తామని మానవత్వంతో స్పందించిన కలెక్టర్…..
నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా సోమవారం కావలి కి చెందిన రమా జ్యోతి అనే వృద్ధురాలు నడవలేని స్థితిలో కింద కూర్చొని ఉండగా అటుగా వెళుతున్న కలెక్టర్ గమనించి నేరుగా ఆమె వద్దకు వెళ్లి సమస్యను అడిగి తెలుసుకున్నారు ,జిల్లాలో మొట్టమొదటి అర్జీని ఆమె వద్ద నుండి స్వీకరించారు ఆమె పెద్ద కొడుకు తనను మభ్యపెట్టి నివసిస్తున్న ఇంటిని తన పేరు మీద రాయించుకుని నన్ను ఇంటి నుంచి వెళ్ళగొట్టాడు. అని అనేక ఇబ్బందులు పడుతున్నాను. నిలువ నీడ లేకుండా చేశాడు అని.. అయ్యా నన్ను మభ్యపెట్టి రాయించుకున్న ఇంటి రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసి నాకు న్యాయం చేయాలని ,కలెక్టర్ కు మొరపెట్టుకుంది తక్షణమే స్పందించిన కలెక్టర్ సంబంధిత అధికారులు పిలిచి ఆమెకు వెంటనే న్యాయం చేయాలని అధికారులను సూచించారు కలెక్టర్ స్వయంగా ఆమె వద్దకు వచ్చి అర్జీ తీసుకున్న విధానాన్ని అక్కడ వాళ్ళని అందరి హృదయాలని కలిచి వేసింది.