అధ్యక్ష మెట్ట వాసులకు సురక్షిత మంచినీరు అందించండి..!

అమరావతి సెప్టెంబర్ 22 :(మన ద్యాస న్యూస్):///

అమరావతిలో జరుగుతున్న శీతాకాలం సమావేశాలలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ మెట్ట ప్రాంత సమస్యలపై గళం విప్పారు. సోమవారం అసెంబ్లీ సమావేశంలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ అధ్యక్ష స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు పూర్తయినప్పటికీ, నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి నియోజకవర్గంలో త్రాగునీటికి ప్రజలు కటకట లాడుతున్నారు. 2018లో క్లోరిన్ బారి నుండి ప్రజలను రక్షించాలని మంత్రి నారా లోకేష్ బాబు వినూత్నంగా మదర్ ప్లాంట్ ఏర్పాటు చేసి దానిద్వారా మండలంలోని ప్రతి గ్రామానికి మినరల్ వాటర్ అందించాలన్న సంకల్పంతో సృజల స్రవంతిని ఏర్పాటు చేశారన్నారు. నెల్లూరు జిల్లాకు మొత్తం 16 మదర్ ప్లాంట్లు మంజూరు కాగా అందులో 8 మదర్ ప్లాంట్లు ఉదయగిరి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలకు మంజూరయ్యాయి అన్నారు. చివరి దశలో ఆ ప్లాంట్లు ఆగిపోయాయని తెలిపారు. తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆ పథకాన్ని గాలికి వదిలేసిందని, 2024లో తిరిగి మన ప్రభుత్వం ఏర్పడిన ఆ పథకం నిరుపయోగంగా ఉందన్నారు. ఎనిమిది కోట్ల రూపాయలు మంజూరు చేస్తే ప్రజలకు మినరల్ వాటర్ అందించవచ్చుని సభ దృష్టికి తీసుకువచ్చారు. ఇది శాశ్వత పరిష్కారం కానప్పటికీ, ప్రస్తుతం మన ముందు ఉన్న సమస్య పరిష్కారానికి మార్గమని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇంటింటికి కొలాయి పథకానికి శ్రీకారం చుట్టారని, అది శాశ్వత పరిష్కారమైనప్పటికీ, ఆ పథకం ఆచరణలోకి వచ్చేసరికి సమయం పడుతున్నందున, యుద్ధ ప్రాతిపదికన సృజన స్రవంతి పథకాన్ని పునరుద్దించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *