🔸ప్రజాసేవలో వెలుగొందాలని ఆకాంక్షలు తెలిపిన రఘురామరాజు…….అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని డిప్యూటీ స్పీకర్ ఆకాంక్ష….

అమరావతి సెప్టెంబర్ 19 :(మన ద్యాస న్యూస్):///

ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ శ్రీ కనుపూరు రఘురామకృష్ణ రాజు ని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ తన పుట్టినరోజు సందర్భంగా కలిసారు.ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయ రంగంలో మరింత ఘనకీర్తి సాధించాలని, ప్రజాసేవలో వెలుగొందాలని ఆకాంక్షించారు.రఘురామరాజు మాట్లాడుతూ — “సామాజిక సేవా దృక్పథంతో, అభివృద్ధి పట్ల కట్టుబాటుతో పనిచేస్తున్న నాయకుల అవసరం నేటి సమాజానికి ఉంది. ఆ లక్షణాలు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారిలో ఉన్నాయని నేను విశ్వసిస్తున్నాను. ప్రజల మన్ననలు పొందుతూ, అభివృద్ధి పథంలో తన నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆశీర్వదిస్తున్నాను” అని అన్నారు.ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు కూడా ఎమ్మెల్యే గారిని కలసి శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *