కార్యకర్తల నినాదాలతో మారుమ్రోగిన కలిగిరి మండలం.

కలిగిరి: సెప్టెంబర్ 19 :(మన ద్యాస న్యూస్):///

కలిగిరి మండల కేంద్రంలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమం కలిగిరి మండల అధ్యక్షులు బిజ్జం కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో, మండలంలోని ప్రముఖ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సమక్షంలో ఉత్సాహంగా జరిగింది.ఈ సందర్భంగా సభా ప్రాంగణం ఉత్సవ వాతావరణాన్ని సంతరించుకుంది. పెద్ద ఎత్తున కార్యకర్తలు, ప్రజలు హాజరై ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారిపై తమకున్న అభిమానాన్ని వ్యక్తం చేశారు. శుభాకాంక్షలతో పాటు “కాకర్ల సురేష్ జయహో” అంటూ నినాదాలతో హోరెత్తించారు.నాయకులు తమ ప్రసంగాల్లో ఎమ్మెల్యే గారి ప్రజాసేవా తపన, అభివృద్ధి పట్ల చూపుతున్న కృషిని ప్రశంసించారు. ప్రజలతో మమేకమై పనిచేస్తున్న ఆయనకు ఈ జన్మదిన వేడుకలో వ్యక్తమైన అభిమానమే ప్రజల విశ్వాసానికి నిదర్శనమని అన్నారు.ఈ కార్యక్రమం లో మండల కన్వీనర్ బిజ్జం వెంకటకృష్ణరెడ్డి, కుదుమలదిన్నెపాడు పి ఏ సి ఎస్ చైర్మెన్ బాసం నరసింహల నాయిడు, నియోజకవర్గం టీడీపీ ఏస్సి సెల్ అధ్యక్షులు సొర్ణ కొండయ్య, రైతు నరేంద్ర, కలిగిరి పి ఏ సి ఎస్ డైరెక్టర్ గన్నమనేని శ్రీనివాసులు నాయుడు,చేరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, చిట్టీపోయిన ప్రసాద్, మాదలా శ్రీనివాసులు, కొప్పోలు కొండలరావు,స్థానిక ప్రజా ప్రతినిధులు,పార్టీ కార్యకర్తలు,యువతతో పాటు గ్రామాల నుండి వచ్చిన అనేక మంది అభిమానులు పాల్గొని వేడుకను విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *