

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం యర్రవరం గ్రామంలో శ్రీ దనలక్ష్మీదేవి ఆలయం
కమిటీ సబ్యులు ఘనంగా చేపట్టారు.శ్రావణమాసం శుక్రవారం సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు.స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ధనలక్ష్మి అమ్మవారిని స్థానిక నేతలతో కలిసి
దర్శించుకున్నారు.గ్రామం నుండే కాకుండా పొరుగు ప్రాంతాల భక్తులు, ధనలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేపట్టారు. పలురకాల వేషధారణలతో, మేళతాలాలతో, బాణసంచాలతో గ్రామ వీధుల్లో ఊరేగింపు చేపట్టారు. గ్రామంలో ఆధ్యాత్మిక శోభసంతరించుకుంది.