

బంగారుపాళ్యం ఆగస్ట్ 06 మన న్యూస్
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండ లం మొగిలి గ్రామంలో వెలసిన శ్రీకామాక్షి సమేత మొగిలీశ్వర స్వామి వారిని రాష్ట్ర శాలివాహన (కుమ్మరి) కార్పొరేషన్ చైర్మన్ ఈశ్వర్ దర్శించుకోవడం జరిగింది.ఆయనకు ఆలయ అధికారులు మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు గావించి తీర్థప్రసాదాలు అందించారు. ఆస్థాన మండపంలో వేదపండితులు ఆశీర్వదించారు.అనంతరం ఆయనను శాలివాహన కుల సంఘ సభ్యులు సన్మానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాకు శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ పదవి రావడానికి కారణం అయిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ ఇతర మంత్రులు, నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా మొగిలి కి రావడం జరిగిందని కుమ్మరి వృత్తి తో మానవుల జీవన విధానంలో ముడిపడి ఉందని పుట్టుక నుండి చావు వరకు మనిషి జీవితంతో కుమ్మరి వారు మట్టిని నమ్ముకుని మట్టితో తయారు చేసిన వస్తువులు తో బ్రతుకుతున్నారు జిల్లాలో శాలివాహన కులస్తుల వృత్తి సంబంధమైన సమస్యలు తెలుకోవడానికి వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.కుమ్మరి కులస్తులు అందరూ కలిసి కట్టుగా ఉండి సమస్యలపై పోరాడాలని నావంతు సహాయసహకారాలు ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.ఈకార్యక్రమంలో రాష్ట్ర శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ ఈశ్వర్,ఉమ్మడి చిత్తూరు జిల్లా కుమ్మరి(శాలివాహన)సంఘం అధ్యక్షుడు చలపతి,జీ కే సీ కల్యాణ మండపం హరి,గుణశేఖర్,వెంకటాద్రి,గిరిబాబు,రవి,పూర్ణ, ఎన్ ఎస్ టి వి జిల్లా ఇంచార్జ్ బాలాజీ,పాండు,టైలర్ చంద్ర,రాణి,అనురాధ తదితరులు పాల్గొన్నారు.
