

మన న్యూస్,ఎస్ఆర్ పురం :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నీ విజయవాడలోని వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి జగనన్నతో మాట్లాడుతూ… బంగారు పాల్యం మార్కెట్ యార్డులో వైఎస్ఆర్సిపి సానుభూతిపరులపై పెట్టిన అక్రమ కేసులను జగనన్నకు వివరించారు. అక్రమ కేసులు అరెస్టు అయిన ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్సిపి పార్టీ అండగా ఉంటుందని జగనన్న భరోసా ఇవ్వడం జరిగిందన్నారు. అక్రమ అరెస్టులులో అరెస్ట్ అయిన వారికి న్యాయ సలహా రక్షణ ఇవ్వడానికి కట్టుబడి ఉన్నామని న్యాయవాది మనోహర్ రెడ్డి కి జగన్ అన్న సూచించినట్లు తెలిపారు. కార్యకర్తలు వైఎస్ఆర్సిపి నాయకులు ఎవరు ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి అండగా ఉండాలని జగనన్న హామీ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా వైఎస్ఆర్సిపి ఉపాధ్యక్షులు గురువారెడ్డి, రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శి బండి హేమ సుందర్ రెడ్డి, గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం బూత్ కన్వీనర్ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.