మన న్యూస్ సింగరాయకొండ:-

బద్దిపూడి గ్రామానికి చెందిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్ సీనియర్ ఆడిటర్ బల్లెకూర ఏడుకొండలు తనయుడు నీరజ్ ఇటీవల యూనియన్ బ్యాంక్ లో అసిస్టెంట్ మేనేజర్ గా ఉద్యోగం పొందిన సందర్భంగా తమ తల్లిదండ్రులు కీ. శే.
బల్లెకూర రమణయ్య, సీతారావమ్మ స్మరించుకుంటూ బద్దిపూడిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలు పి యం పి మరియు కె ఎం పి లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన 20,000 రూపాయలు విలువ చేసే విద్యా సామాగ్రి అందజేశారు.
అనంతరం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేశారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్యాశాఖ అధికారి పి వి రమణయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ పాఠశాలలో అభివృద్ధిలో గ్రామస్తులు భాగస్వామ్యం కావటం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ,నూతన వస్తువులు, దుస్తులు,పుస్తకాలు విద్యార్థుల నూతన ఉత్తేజాన్ని కలిగిస్తాయని, ప్రైమరీ సెక్షన్ లోని ఉపాధ్యాయులు ప్లే వే మెథడాలజీ ఉపయోగించి విద్యార్థులకు చక్కని భోదన అందించాలని సందర్భంగా తెలియజేశారు.వెలుగు ప్రాజెక్ట్ ఏ.పి.ఎం గోపినాథ్ మాట్లాడుతూ తాము పుట్టి పెరిగిన ఊరు, తాము బాల్యంలో చదువుకున్న పాఠశాలలోని విద్యార్థులకు ఈ విధంగా విద్యాపరమైన సహకారం అందించడం తమ బాధ్యతని అన్నారు.గ్రామ పెద్దలు కూనం యలమండారెడ్డి దాతలను అభినందించారు.కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుని తాటితోటి వరలక్ష్మి,హైకోర్టు న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు సుదర్శి గోపి,వెలుగు ప్రాజెక్ట్ ఏపీఎం కృష్ణయ్య,సీసీ సురేష్, జిలాని,బల్లెకూర శ్రీనివాసులు, మధు మరియు గ్రామపెద్దలు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *