

మన న్యూస్ సింగరాయకొండ:-
సింగరాయకొండ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 2024 – 25 విద్యా సంవత్సరంలో పదవ తరగతి 582 మార్కులతో ఉత్తీర్ణురాలైన విద్యార్థిని తన్నీరు శశి నిన్న ప్రకటించిన రాజీవ్ గాంధీ సాంకేతిక విశ్వవిద్యాలయంలో నూజివీడు క్యాంపస్ నందు ట్రిపుల్ ఐటీ సీటు సాధించిన సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయిని కే.మహాలక్ష్మి విద్యార్థిని చిరంజీవి తన్నీరు శశిని పాఠశాలలో జరిగిన ఒక కార్యక్రమంలో అభినందించారు.విద్యార్థినికి ఆరు సంవత్సరాల పాటు బీటెక్ పూర్తయ్యేంతవరకు అత్యున్నతమైన సాంకేతిక విద్య పూర్తి ఉచితంగా అందుతుందని… విద్యార్థిని సదరు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు.