Oplus_16777216

అట్లూరు: జూన్ 24: మన న్యూస్: కడప జిల్లా, అట్లూరు మండలం, కమలకూరు గ్రామానికి చెందిన విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ (VRA) దారం పెద్ద గురవయ్య అనారోగ్యంతో మంగళవారం ఉదయం మృతి చెందారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఏపీ, వీఆర్ఏ, వెల్ఫేర్ మరియు సర్వీస్, అసోసియేషన్, రాష్ట్ర అధ్యక్షులు నల్లి పోగు నాగేశం ఆయనకు పూలదండ వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాగేశం మాట్లాడుతూ, వీఆర్ఏ గా రెవెన్యూలో ఆయన సేవలు గుర్తుంటాయని అలాగే వారి కుటుంబాన్ని ఓదార్చి ధైర్యం చెప్పడం జరిగింది. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యం విషమించడంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి.సమాజ సేవకుడిగా, రెవెన్యూ శాఖలో నిష్ఠతో పని చేసిన వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు. ఆయన మరణంపై గ్రామస్తులు, సహచరులు, అధికారులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో టి భాష, గురు స్వామి, కే పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *