విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి: జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

మన న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం, విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్. అన్నారు. సోమవారం జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ,ట్రైబల్, మధ్యాహ్న భోజన పథకం అమలు లో ఉన్న పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలు చేపట్టాల్సిన చర్యలపై అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన,ట్రైబల్ వెల్ఫేర్ డిడి మణమ్మ తో కలిసి జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు , తాసిల్దారులు, ఎంపీడీవోలు, ఎంఈఓ లు, సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని హాస్టల్స్ ను జిల్లా, మండల స్థాయి అధికారులు తమ పరిధిలోని హాస్టల్స్ ను నిరంతరం పర్యవేక్షించాలి అన్నారు. అధికారులందరూ తమ పరిధిలోని హాస్టల్స్ ను వ్యక్తిగతంగా వెళ్లి పరిశీలించి, హాస్టల్స్ లో నెలకొన్న పరిస్థితులు ఉన్న సమస్యలపై ఫోటో లతో కూడిన నివేదిక అందించాలన్నారు. హాస్టల్స్ కు సరఫరా అయ్యే బియ్యం నాణ్యతను ఎప్పటి కి అప్పుడు పరీక్షించి రిజిస్టర్లలో సంతకం చేయాలన్నారు. హాస్టల్స్ కు సరఫరా అయ్యే బియ్యం నాణ్యత ప్రమాణాలు పాటించాలని పౌరసరఫరాల అధికారులను ఆదేశించారు. హాస్టల్స్ లోని స్టోర్ రూమ్ లలో పరిశుభ్రత పాటించాలన్నారు. హాస్టల్స్ లోని వంట గదులలో పరిశుభ్రత పాటించాలన్నారు. హాస్టల్స్ సరఫరా బియ్యం శుభ్రం చేసిన తర్వాత స్టోర్ రూమ్ లో భద్రపరచాలన్నారు. ముందుగా వచ్చిన బియ్యాన్ని వంటకు ఉపయోగించాలని ఆయన అన్నారు. పాఠశాలలో ఉత్సాహవంతులైన విద్యార్థిని విద్యార్థులలో ఒకరిని లీడర్ గా నియమించి పరిశుభ్రత పాటించే విధంగా చూడాలన్నారు. విద్యార్థులు తామే తమ ప్లేట్లను శుబ్రం పరచుకోకుండా, హాస్టల్స్ లో వర్కర్లు శుభ్రం చేసి ప్లేట్లను భద్రపరిచేందుకు సౌక ర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. హాస్టల్స్, పాఠశాలల్లో పరిశుభ్రమైన నాణ్యమైన ఆహారం అందించే బాధ్యత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపల్ లు, హాస్టల్ వార్డునులదే అని ఆయన అన్నారు. విద్యార్థులకు అందించే ఆహారంలో ఎటువంటి పొరపాట్లు జరిగిన కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. ముందుగా అన్ని హాస్టల్స్ ను అధికారులు సందర్శించి సోలార్ వాటర్ హీటర్లు ఎన్ని ఉన్నాయి ఎన్ని పనిచేస్తున్నాయి లేదా కొత్తగా ఎన్ని కావాలి అనే పూర్తి వివరాలను నివేదికలు అందించాలని ఆదేశించారు. అదేవిధంగా గర్ల్స్ హాస్టల్ లో మరుగుదొడ్ల సదుపాయాల గురించి నివేదికల అందించాలన్నారు.అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విద్యార్థులకు నాణ్యమైన మరియు ఆరోగ్యవంతమైన ఆహారం అందించాలని, దానికి గాను కావలసిన పరికరాలు లేదా వస్తువులు, నెలకొన్న సమస్యలు నివేదికలు అందజేయడం ద్వారా వాటిని పరిష్కరిస్తామని కలెక్టర్ అధికారులకు తెలిపారు. నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని చేపట్టాల్సిన పనుల గురించి కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీలలో ఎనర్జీ ఎస్, ఎం సి సి, డిసిసి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో నిర్వహించాలన్నారు. రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో భాగంగా ఉదయం 11 గంటలకు అధికారులందరూ ప్రతిజ్ఞ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అమృత్ సరోవర్ క్రింద కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఇంటింటి కుటుంబ సర్వే డేటా ఎంట్రీ ప్రక్రియను వేగవంతం చేయాలని, దానికి అనుగుణంగా కంప్యూటర్ ఆపరేటర్లను ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ప్రజా ప్రతినిధులు, మాజీప్రజా ప్రతినిధులు అందరి గృహ సర్వే పూర్తి అయినది లేనిది సరిచూసుకోవాలని తాసిల్దారులను ఆదేశించారు. ఏ ఒక్క గృహం వదలకుండా 100% సర్వే పూర్తి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

  • Related Posts

    ఫ్రీజ్ సిలిండర్ పేలి గాయాల పాలైన క్షతగాత్రులను పరామర్శించిన…జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరిత

    గద్వాల జిల్లా మనధ్యాస డిసెంబర్ 6జోగులాంబ గద్వాల జిల్లాగద్వాల నియోజకవర్గం ధరూర్ మండల కేంద్రానికి చెందిన అడవి ఆంజనేయులు స్వగృహంలో ఫ్రీజ్ సిలిండర్ పేలి ఒకసారి పెద్దఎత్తున మంటలు ఎగసి పడటంతో ఇద్దరు మహిళలు ఒక చిన్నారి కి తీవ్ర గాయాలైన…

    నేను బలపరిచిన అభ్యర్థులను సర్పంచులు గా గెలిపించండి – ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్ రెడ్డి

    గ్రామాభివృద్ధి కి తోడ్పడండి ,ఆలూరు గ్రామ ప్రజలు త్యాగం మరువలేనిది స్థానిక సంస్థలు సర్పంచ్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా గట్టు మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్ రెడ్డి గద్వాల జిల్లా మనధ్యాస డిసెంబర్ 6 :- జోగులాంబ గద్వాల జిల్లాగద్వాల నియోజకవర్గం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    శిశు మందిర్లో సప్త శక్తి సంగం అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు

    శిశు మందిర్లో సప్త శక్తి సంగం అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు

    అపూర్వ కలయిక పాత మిత్రులదళాయివలస జలపాతం వద్ద పిక్నిక్ సందడి స్నేహానికి వన్నె తెచ్చిన 1987 పదవతరగతి బ్యాచ్

    అపూర్వ కలయిక పాత మిత్రులదళాయివలస జలపాతం వద్ద పిక్నిక్ సందడి  స్నేహానికి వన్నె తెచ్చిన 1987 పదవతరగతి బ్యాచ్

    ‎ఎస్‌.టి.యు చిత్తూరు జిల్లా శాఖ – నూతన జిల్లా కార్యవర్గం ఎన్నిక

    ‎ఎస్‌.టి.యు చిత్తూరు జిల్లా శాఖ – నూతన జిల్లా కార్యవర్గం ఎన్నిక

    *ఘనంగా లండన్ ఎన్నారై వల్లేరు కళ్యాణ్ జన్మదిన వేడుకలు*

    *ఘనంగా లండన్ ఎన్నారై వల్లేరు కళ్యాణ్ జన్మదిన వేడుకలు*

    పారిశ్రామికవేత్త డీకే బద్రి నారాయణ భౌతిక కాయానికి నివాళులు

    పారిశ్రామికవేత్త డీకే బద్రి నారాయణ భౌతిక కాయానికి నివాళులు

    ఘనంగా అత్యాధునిక పరికరాలతో గోల్డెన్ జిమ్ ప్రారంభం

    ఘనంగా అత్యాధునిక పరికరాలతో గోల్డెన్ జిమ్ ప్రారంభం