oplus_144703488

శంఖవరం మన న్యూస్ (అపురూప్):- కాకినాడ జిల్లా ప్రతిభ నియోజకవర్గ మండల కేంద్రమైన శంకవరం ఏపీ మోడల్ స్కూల్ లో యోగా దినోత్సవ వేడుకలను శనివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. యోగ కార్యక్రమంలో శంఖవరం మండల విద్యాశాఖ అధికారి సూరిశెట్టి వెంకటరమణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరికీ యోగాసనాలు చాలా అవసరమని అన్నారు. యోగాను ప్రతి ఒక్కరూ జీవితంలో నిబద్ధతో కూడిన అలవాటుగా చేసుకోవాలన్నారు. యోగా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను ఇతరులకు వివరించాలన్నారు. అలాగే విద్యార్థులు కూడా కేవలం చదువు మాత్రమే కాకుండా యోగాను దినచర్యలో భాగంగా పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ వీర్రాజు, డాక్టర్ కిరణ్,తదితర ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *