అభివృద్ధి ప్రదాత సీఎం చంద్రబాబు……. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి

మన న్యూస్, కొడవలూరు:- ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ చొరవతో గ్రామాల్లో పల్లె పండుగ- ఈ ఏడాది కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు- గ్రామాల్లో జరిగిన పనులు గ్రామస్థులకే అంకితం- కోవూరు నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నాంగ్రామాల అభివృద్ధే ధ్యేయంగా పల్లె పండుగ కార్యక్రమం జరుపుకొంటున్నామని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. బుధవారం కొడవలూరు మండలం పెయ్యలపాలెంలో 1 కోటి రూపాయల వ్యయంతో ఏర్పాటు చేయనున్న బిటి రోడ్డు, 5 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్లకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ…..అభివృద్ధి ప్రధాత నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని అన్నారు. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ , మంత్రి నారా లోకేష్‌ సహకారంతో అటు గ్రామాలను, ఇటు పాఠశాలల ఉన్నతికి పాటుపడుతున్నామన్నారు.ఒక వైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ది చేస్తున్న సీఎం చంద్రబాబు కి ప్రతి ఒక్కరూ రుణపడి ఉంటారన్నారు. ఈ ఏడాది కాలంలో అన్ని రంగాల అభివృద్ధికి నిధులు తెచ్చామన్నారు. గ్రామాల్లో చేపట్టిన పనులు గ్రామస్థులకే అంకితం చేస్తున్నామన్నారు. అవినీతి రహిత నియోజకవర్గాన్ని తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. రాబోయే రోజుల్లోనూ ఇలాంటి అభివృద్ధికి కొనసాగిస్తామని చెప్పారు. కోవూరు నియోజకవర్గంతో తాను ఎన్నికల ప్రచారంలో తాగునీటి సమస్యను ప్రజలు తన దృష్టికి తెచ్చేవారని, కానీ నేడు అన్ని ప్రాంతాల్లో నీటి సమస్యకు పరిష్కారం చూపామన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించామని చెప్పారు. కొడవలూరులో 10 లక్షలు CSR నిధులతో ముస్లిం సోదరుల కోసం షాదీమంజిల్ నిర్మాణ పనులు చేపట్టామన్నారు. మండల పరిధిలోని వివిధ గ్రామాలలో 1 కోటి 23 లక్షల వెచ్చించి 22 సిసి రోడ్లు వేసాం. కొడవలూరు మండలంలో జడ్పీ నిధులు 20 లక్షలతో 4 పనులు జరుగుతున్నాయని వివరించారు. మండలంలో ఎంపీ ల్యాడ్స్‌ 25 లక్షలతో 5 పనులు జరుగుతున్నాయని వివరించారు. గత ఐదేళ్లుగా అభివృద్ధి ఊసే లేని గ్రామములలో అత్యవసర ప్రాతిపదికన కొత్తగా కల్వర్టుల నిర్మాణం, శిథిలావస్థకు చేరిన పాఠశాలల మరమ్మతులు చేపట్టామని, పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి సహకారంతో మండలంలోని 2770 ఎకరాల ఇఫ్కో కిసాన్‌ సెజ్‌లో పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తున్నామన్నారు. నాయకులు అందరూ అవినీతికి దూరంగా ప్రజల అభివృద్ధికి కృషి చేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో జివిఎన్ శేఖర్ రెడ్డి, నాప వెంకటేశ్వర్లు నాయుడు, పందిటి వరప్రసాద్ రెడ్డి, కేతు వెంకటరమణారెడ్డి, భూలోకం విజయ్ కుమార్, కరకటి మల్లికార్జున, నల్లవుల శ్రీనివాసులు, చెముకుల వెంకయ్య, అమరేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 6 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు