విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో త్వరలో జిల్లా వ్యాప్తంగా కంటి వైద్య పరీక్షలు.*వెల్లడించిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి .*ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10 మంది దివ్యాంగులకు ట్రై సైకిల్స్ అందజేత.వి.పి.ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో త్వరలో జిల్లా వ్యాప్తంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నామని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు. ప్రతి గ్రామానికి వైద్యులను పంపి కంటి పరీక్షలు చేయిస్తామన్నారు. అవసరం అయినవారికి ఆపరేషన్స్ కూడా చేయించే బాధ్యత తీసుకుంటున్నామని వివరించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం పదిమంది దివ్యాంగులకు విపిఆర్ నివాసంలో ట్రై సైకిల్స్ అందజేశారు. ట్రై సైకిల్స్ అందుకున్న వారిలో అనంతసాగరం, ఉదయగిరి, దుత్తలూరు, వింజమూరు, జలదంకి, నెల్లూరు సిటీ, రూరల్ మండలాలకు చెందిన దివ్యాంగులు ఉన్నారు. ట్రై సైకిల్స్ ద్వారా జిల్లా వ్యాప్తంగా దివ్యాంగులను ఆదుకుంటున్నామని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. జిల్లాలో ఎంత మంది దివ్యాంగులు ఉన్నా ప్రతి ఒక్కరికి ట్రై సైకిల్ ఇస్తామన్నారు. ఎవరైనా మిస్ అయి ఉంటే తప్పకుండా తమను సంప్రదించాలని తెలిపారు. అలాగే ట్రై సైకిల్స్ తీసుకున్నవారిలో ఎవరికైనా ఇబ్బందులు వస్తే తమ సంప్రదించాలని, మెయిటెనన్స్ కూడా ఫౌండేషన్ తరఫున చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో కేతంరెడ్డి వినోద్ రెడ్డి, జనసేన నాయకులు గుడి హరిరెడ్డి, ఇతర ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

i

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *