నెల్లూరులో యోగాసనాలు వేసిన ఎన్సిసి క్యాడెట్లు

మన న్యూస్, నెల్లూరు :10 ఆంధ్ర నేవల్ యూనిట్ ఎన్. సీ.సీ నెల్లూరు లెఫ్ట్నెంట్ కమాండర్ గణేష్ గొదంగవే ఆదేశాల మేరకు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నెల్లూరు నందు 2025 మే 21 నుంచి 2025 జూన్ 21 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న యోగాంధ్ర శిక్షణా కార్యక్రమానికి నగరంలోని కే.ఎన్.ఆర్. నగరపాలక ఉన్నత పాఠశాల, భక్తవత్సల నగర్ ఎన్ సి సి సెకండ్ ఆఫీసర్ గుండాల నరేంద్రబాబు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ వెంగళరావు నగర్ సెకండ్ ఆఫీసర్ సి.వి నాగరాజు, ప్రభుత్వ ఆదర్శ ఉన్నత పాఠశాల సంతపేట థర్డ్ ఆఫీసర్ డి. పెంచలయ్య ఆయా పాఠశాలల ఎన్సిసి క్యాడెట్లు హాజరై యోగాసనాలు వేసి, ధ్యానము చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ జిల్లా కలెక్టర్ & మేజిస్ట్రేట్ కే. కార్తీక్ ఐ. ఏ. ఎస్, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ వి.సుజాత, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉప అధికారి డాక్టర్ ఖాదరవల్లి, నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ వై వో నందన్, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి యతిరాజ్, మున్సిపల్ సిబ్బంది, వైద్య సిబ్బంది క్రీడాకారులు, యోగ మాస్టర్లు, జిల్లా ప్రజలు విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కే కార్తీక్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ దయనందిన జీవితంలో యోగ ఆసనాలు వేయడం ధ్యానం చేయడం ద్వారా మానసిక ఒత్తిడి నుంచి అంతేకాకుండా అనేక సమస్యల నుంచి మనం బయటపడవచ్చు అని యోగా ఆసనాల విశిష్టతని ప్రాధాన్యతనే గురించి ప్రజలకు ఒక అవగాహనను కల్పించేటువంటి లక్ష్యంతో మే నెల 21వ తారీకు నుంచి జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం వరకు ఒక మాసం పాటు యోగాసనాల ప్రాధాన్యతను నిత్యజీవితంలో దాని యొక్క ప్రాముఖ్యతను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసేటువంటి దాంట్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని కాబట్టి ప్రజలందరూ తమ నిత్య జీవితంలో యోగాకు మరింత ప్రాముఖ్యతను ఇవ్వాలని తద్వారా అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం యోగాసాధన చేయాలని, యోగాభ్యాసనాలు సర్వరోగ నివారిణిగా పనిచేస్తాయని తెలియజేశారు.

  • Related Posts

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 6 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు