నెల్లూరు నగరంలో “వెన్నుపోటు దినాని”కి సునామిలా వేలాదిగా తరలివచ్చిన వైయస్సార్ కార్యకర్తలు, ప్రజలు

మన న్యూస్, నెల్లూరు:నెల్లూరు సిటీలో బుధవారం వెన్నుపోటు దినం కార్యక్రమానికి 5 వేల మందికి పైగా తరలివచ్చిన వైసిపి కార్యకర్తలు, ప్రజలు *కూటమి ప్రభుత్వపు దొంగ హామీలను నిరసిస్తూ.. కలెక్టర్ వరకు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో కార్యకర్తలు భారీ ర్యాలీ.*ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం విజయవంతం .కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ.. నెల్లూరు వీఆర్సీ సెంటర్ నుంచి వైఎస్ఆర్సిపి సిటీ ఇన్ చార్జ్ & ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం వెన్నుపోటు దినం కార్యక్రమం విజయవంతంగా సాగింది .ముందుగా విఆర్సి సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వి ఆర్ సి సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలు 5000 వేల మందికి పైగా తరలివచ్చి కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ.. ర్యాలీ నిర్వహించారు. వెన్నుపోటు దినం కార్యక్రమానికి.. అడుగడుగునా ప్రజలు.. నీరాజనాలు పలికారు.కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను.. అమలు జరపాలంటూ కార్యకర్తల నినాదాలతో.. కలెక్టరేట్ పరిసర ప్రాంతాలు.. కిక్కిరిశాయి. అనంతరం కలెక్టరేట్ వద్దకు చేరుకొని వైసిపి నెల్లూరు పార్లమెంట్ పరిశీలకులు జంకే వెంకట రెడ్డి , వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కలెక్టరేట్ ఎఒ కి.. వినతి పత్రం అందజేసి.. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ఈరోజు ప్రజలు పడుతున్న ఇబ్బందులను.. తెలియజేసి.. ఆ హామీలన్నీ నెరవేర్చే విధంగా ప్రభుత్వానికి.. తెలియజేయాలని కోరారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ….. ఏడాది కిందట కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు.. ప్రజలకు అబద్ధపు హామీలు గుప్పించి.. వారందరిని మోసం చేసిందన్నారు. కూటమి ప్రభుత్వ మోసపు హామీలకు సరిగ్గా నేటికీ ఏడాది కాలమయ్యిందన్నారు. రైతులకు, విద్యార్థులకు, ఉద్యోగులకు, నిరుద్యోగులకు, వ్యాపారులకు, మహిళలకు, వృద్ధులకు ఇలా అనేక వర్గాల ప్రజలకు హామీలు గుప్పించి.. ఈరోజు వాటిని నెరవేర్చే క్రమంలో.. కూటమి ప్రభుత్వం కుంటి సాకులు చెప్పి తప్పించుకుంటుందని మండిపడ్డారు. ఈరోజు ఆ హామీలన్నింటినీ అమలు చేయాలని కోరుతూ .. జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని నిర్వహించిందన్నారు. ఈ కార్యక్రమానికి నిన్నటి రోజు నుంచి పోలీసులు ఎన్నో అడ్డంకులు సృష్టించినప్పటికీ వేలాదిగా ప్రజలు తరలివచ్చి.. కూటమి ప్రభుత్వ విధానాలు ఎండగట్టారని తెలిపారు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో ప్రజలు ఎన్నో అవస్థలు పడుతున్నారని తెలిపారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా.. ప్రభుత్వం ఇంటి పన్నులు, కరెంటు చార్జీలు, పెంచుతూ నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగి సామాన్యుడు బతకలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈరోజు ప్రజా సమస్యలపై కలెక్టరేట్ వస్తే.. మా దగ్గర నుంచి వినతిపత్రం తీసుకునేందుకు కలెక్టర్ , జాయింట్ కలెక్టర్ , DRO ఎవరు అందుబాటులో లేకుండా చేశారన్నారు.ప్రజా సమస్యలను.. ప్రతిపక్ష పార్టీ నేతలు అధికారులకు తెలియజేయడానికి వస్తే.. వారిపై కేసులు నమోదు చేసే.. దుస్థితికి కూటమి ప్రభుత్వంలో అధికారులు తయారయ్యారంటే.. ఎంత దారుణంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందో ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలన్నారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదని.. నెల్లూరులో ఎన్నడు ఇలాంటి పరిస్థితులు చూడలేదన్నారు. ఈరోజు అధికార పార్టీ అవలంబిస్తున్న విధానాలను.. రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తాము ఇదే విధంగా వ్యవహరిస్తే.. టిడిపి నేతలకు ఇబ్బందులు తప్పవని కూటమి ప్రభుత్వాన్ని ఘాటుగా హెచ్చరించారు. ఈరోజు అధికార పార్టీ ఎన్ని బాధలు పెట్టినా భరిస్తూ.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచనలు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడుతుందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఇచ్చిన హామీలు అమలు చేయాలని.. లేనిపక్షంలో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

  • Related Posts

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మన ధ్యాస,కోవూరు, సెప్టెంబర్ 12: అక్రమ లేఅవుట్లను ఆదిలోనే అడ్డుకునే విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలి .కోవూరు నియోజకవర్గ పరిధిలో నుడా నిబంధనలు పాటించని అనధికార లే అవుట్ల యజమానులు 2025 అక్టోబర్ 30వ తేదీ లోపు అపరాధ రుసుం చెల్లించి…

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మన ధ్యాస ,ఇందుకూరుపేట ,సెప్టెంబర్ 12:. జగదేవి పేటలో 50 లక్షలతో సిసి రోడ్ల ప్రారంభోత్సవం. – మరో 50 లక్షల నుడా నిధులతో డ్రైన్ల నిర్మాణానికి శ్రీకారం .అభివృద్ధి, సంక్షేమం ఏకకాలంలో అమలు చేసే పాలనా దక్షత ముఖ్యమంత్రి చంద్రబాబు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    అచ్చంనాయుడుది నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు…….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల (ఐ అండ్ పి ఆర్) శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా