మన న్యూస్, నెల్లూరు రూరల్:నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టిడిపి రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం నెల్లూరు రూరల్ నియోజకవర్గం 33వ డివిజన్ నందు డివిజన్ టిడిపి అధ్యక్షులు కరణం హజరత్ నాయుడు స్టోర్ నెంబర్ 80,84 నందు బియ్యం మరియు చక్కెర మరియు జొన్నలు లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ నెల నుండి ఇంకా ప్రతి నెల రేషన్ షాపుల వర్థ ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు మరియు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ డీలర్ మీకు అందుబాటులో ఉండి సరుకులు ఇవ్వడం జరుగుతుంది. కావున 33వ డివిజన్లోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. 65 సంవత్సరాలు పైబడి మంచాన ఉన్న వృద్ధులకు రేషన్ డీలర్లు ఇంటికి వచ్చి రేషన్ ఇవ్వడం జరుగుతుంది. కావున ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. డివిజన్ లని ప్రజలకు ఈ రేషన్ సంబంధిత సమస్యలు ఏమైనా ఉన్నా డివిజన్ కార్పొరేటర్ కరణం మంజుల హజరత్ నాయుడు దృష్టికి తీసుకురావాలని కోరుకుంటున్నాము.పై కార్యక్రమంలో డివిజన్ టిడిపి నాయకులు, భూత్ ఇన్చార్జిలు, ప్రజలు తదితరులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *