నెల్లూరులో ఘనంగా కిమ్స్ హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ వేడుకలు

మన న్యూస్, నెల్లూరు :వైద్య రంగంలో ఉత్తమ వసతులతో కూడిన వైద్య సేవలు అందించడం కిమ్స్‌ హాస్పిటల్‌ కే సాధ్యమైందని నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఈ 25 ఏళ్ల కాలంలో అనేక మైళు రాళ్లు అధిగమించి ఈ స్థాయికి చేరుకున్నారని చెప్పారు. నగరంలోని కస్తూరి దేవి గార్డెన్స్‌ లో వైభవంగా నిర్వహించిన కిమ్స్‌ హాస్పిటల్‌ సిల్వర్‌ జూబ్లీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేయగా.. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్ రావు, పాశం సునీల్ కుమార్, కాకర్ల సురేష్,బొల్లినేని కృష్ణయ్య, శీనయ్య, భాస్కర్‌ రావ్‌ ఇతర ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అనంతరం ఎంపీ వేమిరెడ్డి మాట్లాడుతూ ….కిమ్స్‌ హాస్పిటల్‌ స్థాపించిన బొల్లినేని కుటుంబానికి నెల్లూరు కావడం గర్వంగా ఉందన్నారు. నెల్లూరు వ్యక్తి ఈ స్థాయికి ఎదగడం సంతోషంగా ఉందన్నారు. కిమ్స్‌ తన సేవలను ఐదు రాష్ట్రాలకు విస్తరించిందని, ఇది గొప్ప విషయమన్నారు. ప్రజలకు తక్కువ ధరకే మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారన్నారు. కిమ్స్‌ గురించి చెప్పేటప్పుడు డాక్టర్‌ శ్రీనివాసరాజు గురించి మాట్లాడుకోవాలన్నారు. ఆయక కిమ్స్‌కు మాత్రమే కాదని, నెల్లూరు ప్రజల వ్యక్తి అని కొనియాడారు. కిమ్స్‌ హాస్పిటల్‌ భవిష్యత్తులో మరిన్ని విజయాలు నమోదు చేయాలని, దేశంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించాలని ఆయన ఆకాంక్షించారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ…… దేశంలోని ఐదు రాష్ట్రాల్లో వైద్య సేవలు అందిస్తూ లక్షలాదిమంది ప్రాణాలకు కాపాడుతున్న కిమ్స్‌ హాస్పిటల్‌ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కిమ్స్‌ హాస్పిటల్ విజయంలో కీలక పాత్ర పోషించిన హాస్పిటల్ యాజమాన్యానికి, వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. అన్నదమ్ముల ఐకమత్యంతో ఇంతస్థాయికి చేరిందని వెల్లడించారు. ప్రతి ఒక్కరినీ కుటుంబ సభ్యులుగా భావించడం వల్లే ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగారన్నారు. నెల్లూరులో ఎన్నో గుండెలకు ప్రాణం పోసిన వ్యక్తి శ్రీనివాసరాజు అని, అలాంటి వ్యక్తులు ఎంతో మంది కిమ్స్‌లో ఉన్నారని, వారందరి కృషితో హాస్పిటల్‌ ఈ స్థాయికి ఎదిగిందన్నారు.

  • Related Posts

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 4 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి