ఫ్లోరైడ్ రక్కసికి పరిష్కారమే విపిఆర్ అమృత ధార

మన న్యూస్, బుచ్చి రెడ్డి పాలెం,మే24:- బుచ్చి, కొడవలూరు, విడవలూరు, మండలాల్లో వాటర్ ప్లాంట్లను ప్రారంభించిన వేమిరెడ్డి దంపతులు.- జిల్లాలో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా 175 కు పైగా వాటర్ ప్లాంట్లు.- పాత, కొత్త నాయకులు సమన్వయంతో పని చేయాలని సూచన .- ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.తాను రాజకీయాల్లోకి రాకముందు నుంచే విపిఆర్ ఫౌండేషన్ ద్వారా విపిఆర్‌ అమృత ధార పేరిట వాటర్ ప్లాంట్ లు ఏర్పాటు చేసినట్లు ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తో కలిసి బుచ్చిరెడ్డిపాలెం మండలం మునలపూడి, కొడవలూరు, విడవలూరు మండలంలోని ఊటుకూరు పల్లిపాళెం గ్రామాల్లో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వాటర్ ప్లాంట్లను శనివారం ప్రారంభోత్సవం చేశారు. ఎంపీ, ఎమ్మెల్యే కలిసి తొలిసారిగా తమ గ్రామానికి వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని వేమిరెడ్డి దంపతులకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మేళ తాళాలతో అపూర్వ స్వాగతం పలికారు. వాటర్ ప్లాంట్స్ ప్రారంభోత్సవం అనంతరం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ…… 2017లో ఉదయగిరి ప్రాంతంలో ఫ్లోరైడ్ నీళ్లు తాగి కిడ్నీ వ్యాధులు బారిన పడుతున్న వారిని చూసి చలించిపోయి సురక్షిత తాగునీరు అందించాలన్న లక్ష్యంతో విపిఆర్‌ అమృత ధార అనే కార్యక్రమం ప్రారంభించినట్లు తెలిపారు. ఇప్పటివరకు నెల్లూరు జిల్లాలో 175కు పైగా వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు ఐదు నియోజకవర్గాలలో దివ్యాంగులకు ఉచితంగా ట్రై సైకిళ్లు అందజేశామని, ఎవరికైనా అవసరం ఉంటే నెల్లూరులోని తమ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.అనంతరం ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ…. ఎన్నికల ప్రచారం సందర్భంగా తాగడానికి సురక్షిత నీళ్లు లేని ఎన్నో గ్రామాలు చూసానని, ఎన్నికలయ్యాక వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తానన్న నాటి హామీ అమలు చేస్తున్నానన్నారు. బుచ్చి మండలం మునలపూడి గ్రామంలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు స్థలమిచ్చిన దాత, పాత్రికేయుడు మురళిని ఆమె అభినందించారు. పాత్రికేయులు విమర్శలే కాకుండా ప్రజా సమస్యల పట్ల కూడా స్పందించాలన్నారు. ఇటీవల టిడిపి అధ్యక్షులుగా నియమితులైన నాయకులతో కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆమె కార్యకర్తలకు సూచించారు. అమృతధార వాటర్ ప్లాంట్ల నిర్వహణ విపిఆర్‌ ఫౌండేషన్ చూసుకుంటుందన్నారు. నీటిని పొదుపుగా వాడుకోవాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కోరారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలపై ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. సచివాలయ సిబ్బంది గ్రామాల్లో అర్హులను గుర్తించి పెన్షన్, రేషన్ కార్డుల దరఖాస్తుల విషయంలో చొరవ తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమాల్లో బుచ్చి ఎంపీపీ మన్నేపల్లి శ్రీనివాసరావు, మునలపూడి సర్పంచ్ వెంకటరమణారెడ్డి, ఎంపీడీవో శ్రీహరి, తాసిల్దార్ అంబటి వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్ పర్సన్ మోర్ల సుప్రజ, బుచ్చి టీడీపీ రూరల్ మండల అధ్యక్షులు బెజవాడ జగదీష్, బుచ్చి మండల టిడిపి గౌరవాధ్యక్షులు టంగుటూరి మల్లారెడ్డి, టిడిపి నాయకులు బత్తుల హరికృష్ణ, సురా శ్రీనివాసులరెడ్డికొడవలూరు మండల అధ్యక్షులు నాపా వెంకటేశ్వర్లు నాయుడు, తహసీల్దారు స్ఫూర్తి రెడ్డి, ఎంపీడీవో సూర్యకుమారి, విడవలూరు మండల టిడిపి అధ్యక్షులు శ్రీహరి రెడ్డి, బెజవాడ వంశీకృష్ణారెడ్డి, పూండ్ల అచ్యుత్ రెడ్డి, ఆవుల వాసు, అడపాల శ్రీధర్ రెడ్డి, పాశం శ్రీహరిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 5 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు