కందుకూరుకు మరో 10 వాటర్ ప్లాంట్లు…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

మన న్యూస్, కందుకూరు,మే24:- ఈ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం .- విపిఆర్‌ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరింత ప్రోత్సా హం అందిస్తాం .- విపిఆర్‌ ఫౌండేషన్ ఆధ్వర్యంలో లింగసముద్రం, కరేడులో అమృత ధార వాటర్ ప్లాంట్ల ప్రారంభం .- హాజరైన ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు.వెనుకబడిన ప్రాంతం కందుకూరు నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. లింగసముద్రం మండల కేంద్రంలోని కేఆర్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విపిఆర్ అమృతధార వాటర్ ప్లాంట్‌ను శనివారం కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుతో కలిసి ఆయన ప్రారంభించారు. ముందుగా పాఠశాల ఆవరణకు చేరుకున్న ఎంపీ, ఎమ్మెల్యేకు పాఠశాల విద్యార్థులు కోలాటంతో అపూర్వ పలికారు. అనంతరం ఆవరణలో ఏర్పాటు చేసిన ప్లాంట్‌ను స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. మహిళలకు బిందెలతో నీటిని అందించారు. వాటర్ ప్లాంట్ భవన నిర్మాణ దాత, పాఠశాల పూర్వ విద్యార్థి అంగులూరి నరసింహారావును ఎంపీ వేమిరెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ…… విపిఆర్‌ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కందుకూరులో ఇప్పటివరకు ఒక వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశామని, ఇప్పుడు మరో రెండు వాటర్ ప్లాంట్లను ప్రారంభించామన్నారు. కందుకూరుకు ప్రాధాన్యతనిస్తూ మరో 10 వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. అవి వివిధ దశల్లో ఉన్నాయని చెప్పారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ వల్ల అటు విద్యార్థులతో పాటు గ్రామస్తులకు కూడా ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని అన్నారు. దాదాపు 2,000 మందికి మేలు జరుగుతుందని వివరించారు. లింగసముద్రం మండలం తమకు మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించిందని, ఈ ప్రాంత అభివృద్ధికి తప్పకుండా కట్టుబడి ఉన్నామన్నారు. సీఎం చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు. త్వరలోనే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు అమలు చేయనున్నారని వివరించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా వాటిని తట్టుకొని సీఎం చంద్రబాబు గారు పాలన సాగిస్తున్నారన్నారు. ఆగస్టు నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. పాత, కొత్త నాయకులందరూ కలిసి సమన్వయంతో ముందుకు సాగాలని, ఏమైనా చిన్న సమస్యలుంటే పరిష్కరించుకొని 2029 ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలన్నారు.ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ…. మెట్ట ప్రాంతమైన కందుకూరుకు విపిఆర్ అమృత ధార వాటర్ ప్లాంట్లను కేటాయించిన ఎంపీ వేమిరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. వాటర్ ప్లాంట్ ద్వారా దాదాపు 2000 మందికి ప్రయోజనం ఉంటుందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. యువ నాయకుడు నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్రం ముందుకు సాగుతోందని, పాఠశాల విద్య సమూలంగా అభివృద్ది చెందుతోందన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులుn ప్రస్తావించిన పలు సమస్యలను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఉలవపాడు మండలం కరేడులో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్‌ను ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రారంభించారు. ప్రత్యేక పూజల అనంతరం స్విచ్ ఆన్ చేసి స్థానికులకు బిందెలతో నీటిని అందించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి, జనసేన నాయకులు గుడిహరి రెడ్డి, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్ 12 2024 ఎన్నికల ముందు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వెనుకబడిన తరగతులైన బీసీలకు ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలను వెంటనే అమలు పరచాలని రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్ డిమాండ్ చేశారు. ఈరోజు బీసీల 5 ప్రధాన డిమాండ్ల…

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఆర్థిక సాయం అందజేసిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్ బోగినేని కాశీరావు….///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    ఆర్థిక సాయం అందజేసిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్ బోగినేని కాశీరావు….///

    బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్

    బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్

    కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 4 views
    కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 4 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 7 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//