మన న్యూస్, నెల్లూరు:*రాష్ట్రాన్ని సంక్షోభం నుంచి బయటకు లాగిన గొప్ప నాయకుడు చంద్రబాబు. *ప్రపంచం గర్వించదగ్గ రాజధానిని తయారుచేసిన దార్శనికుడు చంద్రబాబు.*కార్యకర్తల కృషి త్యాగాల వల్లే కూటమి ప్రభుత్వం ఏర్పడింది.*నాటి వైసిపి ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు ఎన్నో పోరాటాలు చేశాం.*కష్టకాలంలో పని చేసిన కార్యకర్తల కష్టాన్ని విస్మరించలేదు, మర్చిపోలేదు. *రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడిన కార్యకర్తలకు సమచిత స్థానం కల్పించాలి.నెల్లూరులోని విపిఆర్ కన్వెన్షన్ సెంటర్ నందు శుక్రవారం నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన నెల్లూరు పార్లమెంట్ మహానాడు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, టిడిపి పోలీట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జిల్లాకు చెందిన శాసనసభ్యులు, నెల్లూరు పార్లమెంట్ టిడిపి ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి లు హాజరయ్యారు. ముందుగా పార్టీ ప్రతినిధుల నమోదు కార్యక్రమం జరిగింది. అనంతరం నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి నివాళి అర్పించి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభించారు. పహల్గాం దాడిలో చనిపోయిన అమాయకులకు, ఆపరేషన్ సింధూర్ లో వీరమరణం పొందిన జవాన్లకు, ఇటీవల కాలంలో మృతి చెందిన పార్టీ కార్యకర్తలకు సంతాపం ప్రకటించారు. నెల్లూరు జిల్లా కు చెందిన ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గ తీర్మానాలను ప్రవేశపెట్టారు. రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రవేశపెట్టిన వారి నియోజకవర్గ తీర్మానాలను నెల్లూరు పార్లమెంట్ కార్యదర్శి కనపర్తి గంగాధర్ బలపరిచారు. కందుకూరు నియోజకవర్గం శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ప్రవేశపెట్టిన వారి నియోజకవర్గ తీర్మానాలను చదలవాడ కొండయ్య బలపరిచారు. కావాలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి ప్రవేశపెట్టిన వారి నియోజకవర్గ తీర్మానాలను పెన్నా డెల్టా వైస్ చైర్మన్ బీద గిరిధర్ బలపరిచారు. కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ప్రవేశపెట్టిన వారి నియోజకవర్గ తీర్మానాలను పెన్నా డెల్టా చైర్మన్ గోపి బలపరిచారు. ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ప్రవేశపెట్టిన వారి నియోజకవర్గ తీర్మానాలను మాజీ శాసనసభ్యులు కంభం విజయరామిరెడ్డి బలపరిచారు. డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ప్రవేశపెట్టిన నెల్లూరు నగర నియోజకవర్గ తీర్మానాలను మాజీ మంత్రివర్యులు తాళ్లపాక రమేష్ రెడ్డి బలపరిచారు. చివరిగా నెల్లూరు పార్లమెంట్ కు సంబంధించిన పది తీర్మాలను నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమంలో షేక్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ………..తెలుగువారి ఆత్మగౌరవాన్ని పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ, పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారం చేపట్టిన ఏకైక ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. రాష్ట్రాన్ని సంక్షోభం నుంచి బయటకు లాగిన గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు అని తెలిపారు.తెలుగురాష్ట్రాల్లో ఐటీ కి బ్రాండ్ అంబాసిడర్ నారా చంద్రబాబు నాయుడు, రాజధాని లేని రాష్ట్రానికి ప్రపంచం గర్వించదగ్గ రాజధాని ని తయారుచేసిన దార్శనికుడు చంద్రబాబు నాయుడు అని అన్నారు.నాటి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ను ఎదుర్కునేందుకు కార్యకర్తలతో కలిసి ఎన్నో పోరాటాలు చేశాం అని అన్నారు.చరిత్ర లో ఎన్నడూ లేని విధంగా పది కి పది స్థానాలు గెలిచాం,నెల్లూరు జిల్లా ప్రజల ప్రేమ అభిమానాలు, కార్యకర్తల త్యాగాలు, కృషే అందుకు కారణం అని అన్నారు.కార్యకర్తల త్యాగాలు, కృషి వల్లే రాక్షస పాలన ను అంతం చేసి ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించగలిగాం అని అన్నారు.వైసీపీ పాలన లో టీడీపీ నాయకులను అక్రమ కేసులతో వేధించారు అని అన్నారు.సభ్యత్వ నమోదు కార్యక్రమం లో రాష్ట్రంలోనే నెల్లూరు పార్లమెంట్ అగ్రగామిగా నిలిచింది అని అన్నారు. కష్టకాలంలో పని చేసిన కార్యకర్తల కష్టాన్ని విస్మరించలేదు, మర్చిపోలేదు. మహిళలు సైతం పోరాటాలు చేసి లాఠీ దెబ్బలు తిన్న రోజులు ఇంకా కళ్ళ ముందు మెదులుతున్నాయి అని అన్నారు.రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడిన కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించాలని మంత్రులను, ఎమ్మెల్యేలను కోరుతున్న అని అన్నారు.ఈ కార్యక్రమంలో టీటీడీ పాలకమండలి సభ్యులు పనబాక లక్ష్మీ, మాజీ ఎమ్మెల్సి బోదాటి రాదయ్య, మాజీ ఎమ్మెల్యేలు కొమ్మి లక్ష్మీ నాయుడు, పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, వంటేరు వేణుగోపాల్ రెడ్డి, ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి, ఆగ్రోస్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు, డిసీసీబీ చైర్మన్ మెట్టుకూరు ధనుంజయ రెడ్డి, రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శులు చంచల బాబు యాదవ్, పుట్టం బ్రహ్మానందరెడ్డి, జీవీఎం శేఖర్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ రాష్ట్ర డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, డిప్యూటీ మేయర్లు రూప్ కుమార్ యాదవ్, సయ్యద్ తహసీన్, రాష్ట్ర కార్యదర్శులు జెన్నీ రమణయ్య, దాబా పెంచలరావు, పమిడి రవికుమార్ చౌదరి, రేబాల శంకర్ రెడ్డి, బొబ్బూరి వెంగళరావు, రావిల్ల వీరేంద్ర చౌదరి, ఎల్ సి రమణారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ తాళ్లపాక అనురాధ, మాజీ మేయర్ నంది మండలం భాను శ్రీ, నేతలు పి ఎల్ రావు, దర్శి హరికృష్ణ, కప్పిర శ్రీనివాసులు, కాకి ప్రసాద్, తిరుమల నాయుడు, షేక్ రసూల్, దోర్నాల హరిబాబు, వేలూరు కేశవ చౌదరి, ఊరందూరు సురేంద్రబాబు, కొండూరు పాలిసెట్టి, మామిడాల మధు, అలేఖ్య తదితరులు పాల్గొన్నారు.


