కూటమి ప్రభుత్వం బడ్జెట్ లో సూపర్ సిక్స్ హామీలకు మొండి చెయ్యి మిగిల్చింది – పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

Mana News :- నెల్లూరు,మన న్యూస్, నవంబర్ 20)
నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం నెల్లూరు వై సి పి నగర నియోజకవర్గ ఇన్ చార్జ్& ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడాతూ……..
బడ్జెట్ లో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించింది అన్నారు.
కూటమి ప్రభుత్వం అప్పులను సాకుగా చూపి.. బడ్జెట్ కేటాయింపులు నామ మాత్రమే అన్నారు.బడ్జెట్ లో సూపర్ సిక్స్ హామీలకు మొండి చెయ్యి మిగిల్చారని అన్నారు.చంద్రబాబు నాయుడు గత ఐదేళ్లలో 2 లక్షల 50 వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తే.. జగన్మోహన్ రెడ్డి తన ఐదేళ్ల కాలంలో ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి కేవలం 330000 కోట్ల రూపాయలు మాత్రమే అప్పు చేశారని అన్నారు.ఎందుకు జగన్మోహన్ రెడ్డి ని వదులుకున్నామా.. చంద్రబాబు నాయుడు అబద్ధపు హామీలను ఎందుకు నమ్మామా అని ఈరోజు ప్రజలంతా ఆలోచిస్తున్నారని అన్నారు. తల్లికి వందనం పేరుతో ప్రతి బిడ్డకి 15000 రూపాయలు ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు బడ్జెట్లో ఆ పథకానికి కేవలం నామ మాత్రపు నిధులు మాత్రమే విడుదల చేశారని అన్నారు.ఆడబిడ్డకు ప్రత్యేక నిధి కింద 1500 ఇస్తానన్న పథకానికి ..పూర్తిగా మంగళం పాడారని అన్నారు.రైతు భరోసా పథకానికి 11 వేల కోట్లు అవసరం కాక.. బడ్జెట్లో కేవలం 1000 కోట్లు మాత్రమే కేటాయించి.. రైతులను నట్టేట ముంచారని ఆరోపించారు.
నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. లాంటి పథకాలను కూటమి ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందనితీయబట్టారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు IR ఇస్తానని, ప్రతి నెల ఒకటో తారీఖున వేతనాలు ఇస్తామని చెప్పినప్పటికీ అవేమీ అమలుకు నోచుకోవడం లేదని అన్నారు.
ఈరోజు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో.. ప్రజలు వారిని నమ్మి మరోసారి మోసపోయామని ఆవేదన చెందుతున్నారు అన్నారు. ఇక నెల్లూరు నగర నియోజకవర్గంలో నెల్లూరు ను అన్ని విధాల అభివృద్ధి చేస్తామని చెప్పిన మంత్రి నారాయణ అభివృద్ధిని మరచి అక్రమణలను మండిపడ్డారు.తమ ప్రభుత్వం లో 100 కోట్ల రూపాయలతో జాఫర్ సాహెబ్ కెనాల్, సర్వేపల్లి కాలువలకు రివిట్మెంట్ వర్క్ చేపట్టడంతోపాటు.. వాకింగ్ ట్రాక్ బ్యూటిఫికేషన్ శ్రీకారం చుట్టామని తెలిపారు. అయితే మంత్రి నారాయణ అభివృద్ధి పనులు మరచి సర్వేపల్లి కాలువ వెంబడి తనవారికి లబ్ధి చేకూర్చేలా దుకాణాలు ఏర్పాటు చేసి ఆక్రమణలకు తెరలేపుతున్నారని దుయ్యబట్టారు. కాలువలు వెంబడి అభివృద్ధి పనులు మరచి.. ఇలా దుకాణాలు ఏర్పాటు చేయడం.. అక్కడ ట్రాఫిక్ సమస్య ఏర్పడటమే కాకుండా.. అక్రమలకు మనమే బీజం వేసినట్లు అవుతుందని అన్నారు. ఒకవేళ అక్కడ షాపులు కేటాయించవలసి వస్తే.. అక్కడ బ్యూటిఫికేషన్ కోసం స్థలాలు ఇచ్చిన స్థానికులకు సూచించారు.అలా కాదని తనవారికి లబ్ధి చేకూరేలా ఇలా షాపులు ఏర్పాటు చేస్తే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు.

  • Related Posts

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 2 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..