

తవణంపల్లి నవంబర్ 19 మన న్యూస్
తవణంపల్లి మండల కేంద్రం వెలుగు కార్యాలయంలో క్యాటిల్ నిర్మాణంపై మండలంలో చెట్లు మంజూరైన పాడి రైతులకు అవగాహన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా మంగళవారం తవణంపల్లి మండలం నందు,ఉపాధి హామీ మరియు పశుసంవర్ధక శాఖ ల అనుసంధానం తో చేపట్టు చున్న క్యాటిల్ షెడ్ ల నిర్మాణం పై ,మండలంలో షెడ్లు మంజూరైన పాడి రైతుల కు అవగాహనా కార్యక్రమంలో జెడి ప్రభాకర్ మాట్లాడుతూ.ప్రతి రైతు వెంటనే పనులు మొదలు పెట్టి డిసెంబర్ 15తేది లోపు పూర్తి చెయ్యాలని మరియు పని నాణ్యత గా ఉండాలని జేడీ ఎం ప్రభాకర్ తెలిపారు.షెడ్ల నిర్మాణం లో నాణ్యత అంశాల గురించి జేఈ రమణ వివరించారు.ఈ కార్యక్రమంలో ఎంపిడివో ఎన్. రెడ్డిబాబు , జెడి ఎం.ప్రభాకర్ , డిడిఎం. డి.ఆరిఫ్, ఏడి-పద్మావతి వెటర్నరీ డాక్టర్ లావణ్యఏపీఓ లలిత , జేఈ వెంకటరమణ,క్షేత్ర సహాయకులు సాంకేతిక సహాయకులు ఫీల్డ్ అసిస్టెంట్లు , పాడి రైతులు పాల్గొన్నారు