

మన న్యూస్ సింగరాయకొండ:-
సింగరాయకొండ లోని స్మార్ట్ జన్ గ్లోబల్ స్కూల్ నందు ASCEND-2025 సెలెబ్రేషన్స్ ను ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ లలిత అధ్యక్షతన జరిగిన ఈ సెలబ్రేషన్స్ కు ముఖ్య అతిథిగా దామచర్ల జయలక్ష్మి హాజరై తన సందేశం ద్వారా ప్రతి తల్లి, తండ్రి విద్యార్థుల అభిరుచులను అర్థం చేసుకొని వారిని ఆ క్రమంలో ప్రోత్సహించి ఉన్నత దశకు పంపించాలని కోరారు. అలానే ఈ సింగరాయకొండ పరిసర ప్రాంతాలలో ఎంతో ఉన్నత విలువలు కలిగి, క్రమశిక్షణతో విద్యార్థులలోని నైపుణ్యాలనువెలికితీసే విద్యాలయాన్ని స్థాపించడం ఈ ప్రాంత ప్రజల అదృష్టం అని తెలియజేస్తూ… స్మార్ట్ జెన్ స్కూల్ వ్యవస్థాపక యాజమాన్యాన్ని అభినందించారు. మరొక ముఖ్య అతిథిగా విచ్చేసిన స్మార్ట్ జన్ గ్లోబల్ స్కూల్ కరస్పాండెంట్ డాక్టర్ గీతా రాణి మాట్లాడుతూ… ప్రతి విద్యార్థిలో అనేక నైపుణ్యాలు ఉంటాయని ఆనైపుణ్యాలను వికశింపజేసి,వారిని సమాజాభివృద్ధికి దోహదపడే లా చేయడమే అసలైన విద్యా లక్ష్యం అని తెలియజేశారు. అయితే తల్లిదండ్రులు తాము ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని.. ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం పిల్లలపై ఒత్తిడి పెంచి వారిని తిరోగమనం వైపు వెళ్లేందుకు దోహదపడుతున్నారని ఇటువంటి విధానాల ద్వారా విద్యార్థి పురోగమనం వైపు పయనించలేడని డాక్టర్ గీతా రాణి పేర్కొన్నారు. గ్లోబల్ స్కూల్ చైర్మన్ పి. శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ స్కూలు ప్రారంభించిన అనతి కాలంలోనే తల్లిదండ్రుల నుంచి విద్యార్థుల నుంచి మంచి ఆదరణ లభించిందని దానికి మేము రుణపడి ఉన్నామని…. ముందు ముందు కూడా పేరెంట్స్ ఇలాంటి ఆదరణ అందిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.PNCA college మరియు స్మార్ట్ జన్ కాలేజి ప్రిన్సిపల్స్ తమ సందేశాలనంతరం విద్యార్థిని విద్యార్థులు సాంస్కృతిక కళారూపాలను అద్భుతంగా ప్రదర్శించారు. బాల బాలికల అద్భుత ప్రదర్శనలను ప్రేక్షకులు ఎంతో ఆనందంగా ఆస్వాదించారు. ఇందులో ప్రధానంగా బాలబాలికలతో పాటు వారి తల్లులు కూడా వేదికపై నృత్యాలను ప్రదర్శించటం అద్భుత పరిణామంగా చెప్పవచ్చు. దీని ద్వారా పిల్లల ఎదుగుదలకు తల్లుల పాత్ర ఏమిటో సభికులకు నృత్యం ద్వారా తెలియజే శారు. దాదాపు రాత్రి 9 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమం భోజన కార్యక్రమంతో ముగించడం జరిగింది. మేనేజ్మెంట్ తో సహా ఉపాధ్యాయులు అందరూ దగ్గరుండి మరి పిల్లలను వారి గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చ డం జరిగింది.