మన న్యూస్ సింగరాయకొండ:-

పదవ తరగతి ఫలితాలలో పాకల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు ప్రధానోపాధ్యాయులు శ్రీ డి.వి.ఎస్ ప్రసాద్ తెలిపారు. నాయుడు నాగ ధనుష్ 583, గొల్లపోతు లక్ష్మి 541, వాయిల శ్రావణి 537 మార్కులు సాధించి వరుసగా పాఠశాల ప్రధమ ,ద్వితీయ, తృతీయ స్థానాలను సాధించినట్లు తెలిపారు. పాఠశాల ఉత్తీర్ణత శాతం 75% కాగా, 500 మార్కులు పైగా పదిమంది విద్యార్థులు సాధించినట్లు తెలిపారు. రెబ్బవరపు కోరేష్ తిరుపాలు 533, చిమటా బిందు భార్గవి 533, కోడూరి దివ్య 526,గొల్లపోతు తిరుపతి 520, వాయిల అజయ్ 516, అయినపూడి దీక్షిత 508,గుడిపాటి మహేశ్వరి 507,మార్కులు సాధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఉపాధ్యాయుని,ఉపాధ్యాయులు గ్రామస్తులు, అభినందించారు ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రభుత్వ పాఠశాలలలో తమ పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు విజ్ఞప్తి చేశారు. నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ పాఠశాలల లక్ష్యమని వారు గుర్తు చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *